Singer Jikki daughter Hemalatha : ఇప్పటి తరం వారికి జిక్కి గారి పాటలంటే జానవులే.. నెరజాణవులే అంటూ ఆదిత్య369 సినిమాలో సిల్క్ స్మిత పాట, అలాగే మురారి సినిమాలో అలనాటి రాంచంద్రుడికి సాంగ్ గుర్తొస్తుంది. అయితే పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో జిక్కి గారు వేల పాటలను పాడారు. ఆమె భర్త ఏఎం రాజా గారి స్వర కల్పనలో మరిన్ని పాటలను ఆమె ఆలపించారు. ఓవైపు సంగీత కచేరిలను చేస్తూనే సినిమా పాటలను పాడిన జిక్కి గారు కెరీర్ మొదట్లో పాటలను ఆలపించి అలాగే సినిమాల్లో నటించారు. ఇక ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలను ఆమె కూతురు హేమలత ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
నాగేశ్వరావు గారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు…
జిక్కి గారు సింగర్ అయినా హీరోయిన్ కి మించిన అందం ఆమెది. ఆమెను చూసి ఇష్టపడిన నాగేశ్వరావు గారు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆమెను అడిగారట. అయితే కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకునికన్న జిక్కి గారికి అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదట. అందుకే వద్దన్నుకున్నారు. అప్పట్లోనే జిక్కి గారికి కార్లంటే చాలా ఇష్టం ఉండటంతో కొత్తగా ఏ మోడల్ వచ్చినా అది కొనేవారట.
అలాంటి అభిరుచి నాగేశ్వరావు గారికి ఉండటంతో జిక్కి గారి వద్ద ఉన్న ఒక కారును ఆయన కొన్నారట. ఈ విషయాలను జిక్కి గారి అమ్మాయి హేమలత పంచుకున్నారు. మనం సినిమా చూసే సమయంలో నాగేశ్వరావు గారి కార్ కలెక్షన్స్ గురించి ప్రస్తావన వచ్చినపుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి అంటూ చెప్పారు హేమలత. జిక్కి గారు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, సింహాళ ఇలా అన్ని భాషలలో కలిపి దాదాపు 10 వేలకు పైగా పాటలు పాడారని చెప్పారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…