Nayanatara: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార ప్రస్తుతం ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఇటీవల షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటించి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఇలా హీరోయిన్ గా నటిస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. అంతే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇలా వరుస సినిమాలు, యాడ్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న నయనతార వ్యాపార రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా రానీస్తోంది. అయితే ఇటీవల నయనతార మరొక కొత్త వ్యాపారం లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఓటీటీల హవా పెరగటంతో థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది. దీంతో కొన్ని చోట్ల థియేటర్లు మూత పడుతున్నాయి. మరికొన్ని థియేటర్లు మాల్స్ తో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్లు గా మారుతున్నాయి.
ఈ క్రమంలో నయనతార మూతపడ్డ ఒక థియేటర్ ను కొనుగోలు చేసి మల్టీప్లెక్స్ థియేటర్ గా మార్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోనే అగస్త్య థియేటర్ ప్రస్తుతం మూట పడింది.
ఈ థియేటర్ ని నయనతార కొనుగోలు చేసి దానిని మాల్స్ తో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్ గా మార్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా నయనతార ప్రస్తుత తెలుగు, తమిళ్, హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. వివాహం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇస్తుందని అందరూ భావించారు. కానీ నయనతార మాత్రం వివాహం తర్వాత కూడా కెరీర్ ని కంటిన్యూ చేస్తూ దూసుకుపోతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…