Sharwanand: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ ఇటీవల రక్షిత రెడ్డి అనే యువతిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ సెలెబ్రెటీలు హాజరయ్యారు. అయితే మీరు నిశ్చితార్థం జరిగే ఐదు నెలలు పూర్తయినా కూడా పెళ్లి గురించి ప్రస్తావన రాకపోవటంతో శర్వానంద్ ,రక్షిత రెడ్డి మధ్య విభేదాలు వచ్చి నిశ్చితార్థం రద్దు చేసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలో తాజాగా వీరి వివాహానికి డేట్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 2, 3 తేదీల్లో శర్వానంద్, రక్షిత రెడ్డి వివాహ వేడుక ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ వేదిక కానుంది. జూన్ 2న ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనుండగా.. జూన్ 3 న వివాహం జరగనుంది.
అయితే రెండు రోజులపాటు జరిగే ఈ వివాహ వేడుక కోసం శర్వానంద్ భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా జైపూర్ లోని లీలా ప్యాలెస్లో వివాహ వేడుకలు నిర్వహించాలంటే పెద్ద మొత్తంలోనే ఖర్చవుతుంది. రెండు రోజులు పాటు జరిగే శర్వానంద్ వివాహ వేడుక కు ఒక్కో రోజుకు దాదాపురూ. 4 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వీరి వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలీజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ మొత్తానికి జూన్ మూడవ తేదీ వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఒక ఇంటివాడు కాబోతున్నాడు. దీంతో శర్వానంద్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…