Nayanatara -Vignesh Shivan: దక్షిణాది సిని ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నయనతార చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఈమె చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో కూడా నయనతార నటిస్తున్నారు.
ఈ సినిమా ఇప్పటికి విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది అయితే సెప్టెంబర్ 7వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఇందులో నయనతార కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చేతిలో గన్ పట్టుకొని ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నారు. ఇక ఈ ఫోటోని విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నయనతారపై ప్రశంశల వర్షం కురిపించారు. షారుక్ ఖాన్ అభిమానిగా ఆయన అన్ని సినిమాలు చూస్తూ వచ్చావు అయితే ప్రస్తుతం ఆయనతోనే కలిసి ప్రధాన పాత్రలో నటిస్తుండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
నిన్ను ఇలా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నువ్వు ఎందరికో స్ఫూర్తిగా నిలిచావు. నిన్ను చూస్తుంటే నేను మాత్రమే కాకుండా మన ఫ్యామిలీ మొత్తం ఎంతో గర్వపడుతుంది అంటూ విగ్నేష్ నయనతార పట్ల ప్రశంశలు కురిపిస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ హీరోగా నటించగా విలన్ పాత్రలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…