Actor JD Chakravarthi : కామెడీలో బ్రహ్మానందం ఒకెత్తు మిగిలిన వారు మరో ఎత్తు. తెలుగు సినిమాలో ఆయన కామెడీ నచ్చని ప్రేక్షకులుండరు. ఆయన సినిమాలో ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ మొదలై ఆయనకోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించిన రోజులు ఉన్నాయి. లెక్చరర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆ తరువాత యాదృచ్చికంగా సినిమాల్లో కి వచ్చి కమెడియన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు. అటువంటి బ్రహ్మానందం గారు షూటింగ్ అప్పుడు నన్ను బాగా టార్చర్ చేసాడు అంటూ జేడి చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వైరల్ అయింది.
నన్ను బాగా టార్చర్ చేసాడు…
జేడి చక్రవర్తి ఓన్ ప్రొడక్షన్ లో మనీ మనీ మనీ సినిమాను తీశారు. అప్పటికే చాలా ఏళ్ళు తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జేడి ఆ సినిమాలో బ్రహ్మానందంను ఖాన్ దాదా క్యారెక్టర్ లో పెట్టుకోవాలని మనీ సినిమా సీక్వెల్ కావడం వల్ల రిపీట్ చేయాలని అనుకుంటే చాలా మంది నీ బడ్జెట్ కి ఆయన వద్దు, ఆయన టైంకి రాడు, ఫుడ్ తనకే కాకుండా చాలా మందికి ఆర్డర్ చేస్తాడు, హోటల్ లో ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్కడు, బ్రేక్ ఎక్కువ తీసుకుంటాడు, సాయంత్రం త్వరగా వెళ్ళిపోతాడు ఇలా ఒక లిస్ట్ ఇచ్చారట.
అయినా ఆ క్యారెక్టర్ కి బ్రహ్మానందం కావాలని జేడి ఆయనన్నే పెట్టుకుని ఆయన టైంకి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా షూటింగ్ గ్ ప్లాన్ చేశారట. అయితే షూటింగ్ కి ఆయన వచ్చి ఒక పదిహేను రోజులు చేసాక తెలిసింది అవన్నీ ఒట్టి అపద్దాలని, అంతవరకూ ఆయనను నొప్పించకుండా ఆయన షెడ్యూల్ ప్రకారం షూటింగ్ ప్లాన్ చేయడానికి నేను టార్చర్ అనుభవించాను అంటూ జేడి చక్రవర్తి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…