NTR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్లైన 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారారు. ఈ విధంగా వీరిద్దరూ తల్లిదండ్రులుగా మారడంతో ఎంతోమంది వీరికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తమ కూతురి కోసం విలువైన కానుకలు పంపుతున్నారు. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ మద్య ఎంతో మంచి బాండింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రామ్ చరణ్ కు కుమార్తె పుట్టింది అనే విషయం తెలియగానే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ కుమార్తె కోసం ప్రత్యేకంగా కొన్ని గిఫ్ట్ పంపించారని తెలుస్తుంది. రామ్ చరణ్ కూతురి కోసం ఎన్టీఆర్ పంపిన ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే… ఎన్టీఆర్ ఒక గోల్డ్ డాలర్ పై ఉపాసన రామ్ చరణ్ పేర్లతో పాటు తమ కుమార్తె క్లీన్ కారా పేరు ఉన్నటువంటి లాకెట్ అలాగే కొన్ని టాయ్స్ కూడా పంపించారట.
ఈ విధంగా ఉపాసన కూతురి కోసం ఎన్టీఆర్ పంపిన ఈ గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఎన్టీఆర్ కుమారులు కూడా వారు వేసినటువంటి డ్రాయింగ్స్ చిన్నారి క్లీన్ కారా కోసం పంపించారని తెలుస్తుంది. ఇక తమ చిన్నారి కోసం ఇలాంటి కానుకలు పంపించడంతో ఉపాసన ఎన్టీఆర్ దంపతులకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపారని తెలుస్తుంది.
రామ్ చరణ్ 11 సంవత్సరాల తర్వాత తండ్రి కావడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా చిన్నారిని ఇప్పటివరకు రామ్ చరణ్ దంపతులు ఎవరికి చూపించలేదు. ఈ క్రమంలోనే తమ చిన్నారిని చూడటం కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఉపాసన తన కూతురి పాలన పాలన చూసుకుంటూ బిజీగా ఉండగా రామ్ చరణ్ తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…