Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ త్వరలోనే బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పాటలలో సాయి ధరమ్ చేసినటువంటి డాన్స్ చూసి నేటిజన్స్ విమర్శలు కురిపించారు.
ఈ విధంగా సాయిధరమ్ తేజ్ డాన్స్ సరిగా చేయకపోవడంతో ఈయన ప్రమాదం జరిగిన తర్వాత డాన్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా అనే సందేహాలను కూడా వ్యక్తం చేశారు. అయితే సాయి ధరంతేజ్ తాజాగా తన డాన్స్ గురించి వస్తున్నటువంటి విమర్శలపై స్పందించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో తనకు స్టెరాయిడ్స్ ఇచ్చారని తెలిపారు.
ఈ విధంగా తాను కోలుకోవడానికి స్టెరాయిడ్స్ మెడిసిన్స్ ఇవ్వటం వల్ల వాటి ప్రభావం తనలో ఇంకా ఉందని అందుకే తాను సరిగా డాన్స్ చేయలేకపోతున్నానని తెలిపారు. నా డాన్స్ పట్ల అభిమానులు మాత్రమే కాదు నేను కూడా తృప్తి పొందలేదని తెలిపారు.అయితే ప్రమాదం జరిగిన తర్వాత తాను మాట్లాడలేకపోయానని ఇప్పుడిప్పుడే వాటిని అధిగమించి మాట్లాడగలుగుతున్నాను.
దీనిని సాకుగా చెప్పినేను అలాగే ఉండను త్వరలోనే డాన్స్ కూడా అద్భుతంగా చేస్తాను. తాను ప్రమాదం తర్వాత ఫిజికల్ గా కూడా ఫిట్నెస్ కోల్పోయాను అయితే ఆ ఫిట్నెస్ కోసం ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నానని అలాగే డాన్స్ కూడా మునుపటిలాగే చేసి మీ అందరిని సంతోష పెడతాను అంటూ ఈ సందర్భంగా సాయి తేజ్ చెప్పినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…