Featured

Nayanathara – Vignesh Shivan: విఘ్నేష్ పెళ్లి విషయంలో భారీ ట్విస్ట్… షాక్ లో అభిమానులు?

Nayanathara – Vignesh Shivan: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నయనతార అటు తమిళ్ తెలుగు భాషలలో స్టార్ హీరోల సరసన నటించి తన ఆనందం, అభినయంతో బాగా ఆకట్టుకుంది.కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలలో నటించిన నయనతార ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.

తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన నయనతార ఇటీవల అతన్ని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. వివాహం జరిగిన దగ్గరినుండి వీరిద్దరూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉన్నారు. తాజాగా ఈ జంట మరొకసారి వివాదంలో నిలిచింది. సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార దంపతులు చట్టానికి విరుద్ధంగా పిల్లలకు జన్మనిచ్చినట్లు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో నయనతార తన పెళ్లికి సంబంధించిన ఒక పెద్ద ట్విస్ట్ రివిల్ చేసింది.సరోగసి ద్వారా ఏ విధంగా పిల్లల్ని కన్నారనే విషయాలకు సంబంధించి పూర్తి ఆధారాలను విగ్నేష్ నయన్ దంపతులు ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. ఈ క్రమంలో వీరిద్దరికి ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ జరిగిందని ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే గతేడాది డిసెంబర్ నెలలో పిల్లల కోసం సరోగసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నయన్ విగ్నేష్ దంపతులు ఆధారాలు సమర్పించినట్లు తెలుస్తోంది.

Nayanathara -Vignesh Shivan: ఆరు సంవత్సరాల క్రితమే వివాహం…

వీరిద్దరూ ఇలా చట్టప్రకారం ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని దాదాపు ఏడాది క్రితం సరోగసి కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు పక్క ఆధారాలు ఉండటంతో వీరు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా వీరిద్దరూ ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న విషయం బయటపడటంతో ఇంతకాలం ఈ విషయాన్ని దాచి ఉంచినందుకు అభిమానులు షాక్ లో ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

5 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

8 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

8 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

8 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

10 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

10 hours ago