Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన విశ్వక్ సేమ్ అతి తక్కువ కాలంలోనే హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల విశ్వక్ సేన్ నటించిన “అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమా మంచి హిట్ అవటంతో హీరోగా విశ్వక్ మరొక మెట్టు పైకి ఎదిగాడు. ప్రస్తుతం ‘ఓరి దేవుడా’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. పీవిపీ సినిమా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని సమర్పిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో అలనాటి హీరో దగ్గుబాటి వెంకటేష్ కీలక పాత్రలో నటించగా.. ఆశాభట్, మిథిలా పాల్కర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రాజమండ్రిలో అక్టోబర్ 16వ తేదీన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా ఘనంగా నిర్వహించారు.
ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ గురించి రాంచరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ…” రెండు తెలుగు రాష్ట్రాలలో విశ్వక్ సేల్ గురించి తెలియని వారు లేరు. ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన విశ్వక్ అతి తక్కువ కాలంలోనే గల్లీ గల్లీకి అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
విశ్వక్ ఏదైనా ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాడని మంచి పేరు ఉంది. ఇలా విశ్వక్ వ్యక్తిత్వానికి నేను ఒక పెద్ద అభిమానిని. ఉప్పెన సినిమా లాగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెంకటేష్ అన్న నీ కోసమైనా ఈ సినిమా చూస్తాను” అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశ్వక్ గురించి రాంచరణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…