Nayanatara -Vignesh: సినీ నటి నయనతార ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తే ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకుంటు ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇలా హీరోయిన్గా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపారవేత్తగా ఎన్నో బిజినెస్లను ప్రారంభించి వ్యాపార వ్యవహారాలను కూడా చూసుకుంటూ ఉన్నారు.
ఈ విధంగా హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. దంపతులకు ఇద్దరు కవల మగ పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం తన బిడ్డల ఆలనా పాలన చూసుకుంటూనే మరోవైపు నయనతార సినిమాలలోనూ అలాగే వ్యాపార సంస్థలను కూడా ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.
ఇలా తన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి నయనతార విడాకులు తీసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు వైరల్ అవుతున్నటువంటి తరుణంలో నయనతార విగ్నేష్ ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆస్తులను నష్టపోవాల్సిందేనా..
ఇక వీరిద్దరి వ్యవహారం గురించి పలువురు సినీ విశ్లేషకులు స్పందిస్తూ వీరిద్దరూ అసలు విడిపోయే అవకాశాలు ఏమాత్రం లేవని స్పష్టం చేశారు. వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంటూ వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అయితే ఈ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచన ఇచ్చిందే విగ్నేష్. అంతేకాకుండా ఈ వ్యాపార సంస్థలన్నీటికి కూడా నయనతార ఆస్తుల ద్వారానే పెట్టారు అంతేకాకుండా ఆయన ఫౌండర్ గాను సీఈఓ గాను వ్యవహరిస్తున్నారు. కనుక భవిష్యత్తులో వీరిద్దరూ విడిపోతే నయనతార భారీ మొత్తంలో ఆస్తి నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే వీరిద్దరూ విడిపోయే అవకాశం లేదని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…