Nayanthara - Vignesh divorce? Nayanthara's shocking post!
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార తన వ్యక్తిగత జీవితం వల్ల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 18 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న ఈ లేడీ సూపర్ స్టార్, రెండు సంవత్సరాల క్రితం తన ప్రియుడు, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు కూడా అయ్యారు.
అయితే ఈ హ్యాపీ ఫ్యామిలీ తాజాగా బ్రేకప్ దిశగా వెళ్తోందన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కథనాలకు ఊతమివ్వడంలా నయనతార తాజాగా పెట్టిన ఓ షాకింగ్ పోస్ట్ వైరల్ అవుతోంది. “పెళ్లంటే పెద్ద మోసం… తాను పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పే” అంటూ ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ కొద్దిసేపట్లోనే డిలీట్ చేసినప్పటికీ అప్పటికే స్క్రీన్‌షాట్‌లు తీసుకున్న నెటిజన్లు వైరల్ చేసి, విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య విభేదాలు తలెత్తాయని, త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ జంట నుంచి ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ నయనతార చేసిన పోస్టుతో ఈ విషయంపై పరోక్షంగా ధృవీకరణ లభించినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
నయన్ – విఘ్న్ ప్రేమకథ
నయనతార – విఘ్నేష్ శివన్ ప్రేమకథ 2015లో ప్రారంభమైంది. ‘నాను రౌడీ ధాన్’ సినిమా సందర్భంగా వీరిద్దరూ పరిచయమై ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఏడేళ్ల పాటు రిలేషన్‌షిప్ కొనసాగించి 2022లో చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఎక్కువగా గోప్యతే పాటించిన ఈ జంట, మధ్య మధ్యలో కలిసి కనిపిస్తూ సోషల్ మీడియాలో ప్రేమ క్షణాలను పంచుకుంటూ ఉండేది.
నిజమేనా ఈ విడాకుల ప్రచారం?
ఈ సందర్భంగా పలువురు అభిమానులు మాత్రం ఇది కేవలం తప్పుడు ప్రచారమే కావచ్చని పేర్కొంటున్నారు. ఒక్క పోస్టుతో విడాకుల నిర్ణయం అంటూ వార్తలు రావడం సరికాదని అంటున్నారు. అయితే, విఘ్నేష్ శివన్ కూడా ఇటీవల నయనతారతో సంబంధిత ఫోటోలు షేర్ చేయడం మానేసినట్టు నెటిజన్లు గమనిస్తున్నారు.
ఇక నిజంగా నయనతార, విఘ్నేష్ జంట విడిపోయే ఆలోచనలో ఉన్నారా? లేక ఇది కేవలం సోషల్ మీడియా వదంతులా? అనేది త్వరలోనే తేలనుంది. అయితే, ఒకప్పటి డ్రీమ్ కపుల్‌గా కనిపించిన ఈ జంట మధ్య ఇప్పుడు దూరం పెరగడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…