Categories: FeaturedMovie News

Neol & Esther : “పెళ్లి చేసుకుని జీవితంలో చాలా పెద్ద తప్పు చేసాం..” రెండో పెళ్లి గురించి ఇద్దరు తగ్గట్లేదుగా..!

Neol & Esther : పెళ్లి జీవితంలో అతిపెద్ద నిర్ణయం. అయితే ప్రస్తుత పరిస్థితులలో పెళ్లి ఎంత త్వరగా చేసుకుంటున్నారో అంతే త్వరగా విడిపోడానికి సిద్ద మైపోతున్నారు. కెరీర్, వ్యక్తిగత స్వేచ్చా దీనికి  కారణంగా ఉన్నాయి. ఇక సాధారణ జనంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక సెలబ్రిటీల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ప్రేమించుకోడానికి పెళ్లి చేసుకోడానికి సమయం పట్టదు వీరికి అలాగే వీడిపోడానికి కూడా సమయం పట్టడడం లేదు. ఎంతో మంది సెలబ్రిటీల పరిస్థితి నేడు ఇలానే ఉంది కలిసి సర్దుబారు చేసుకోలేకపోవడం వల్ల విడిపోయి జీవిస్తున్నారు.

పెళ్లి చేసుకుసుకుని అతిపెద్ద తప్పు చేసాము…

సింగర్ మరియు రాపర్ అయిన నోయల్, హీరోయిన్ ఎస్తేర్ ను వివాహం చేసుకున్నారు. మొదట్లో బాగానే ఉన్న వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. అయితే వీళ్ళు వీడిపోయిన తరువాత ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా సోషల్ మీడియా మాత్రం వీళ్ళను వదలడం లేదు వారు వీడిపోవడానికి కారణాలు, ఇక రెండో పెళ్లి గురించి రక రకాల ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. అయితే వేరు వేరు అభిప్రాయాలతో వీడిపోయిన వీరిద్దరూ వారి పెళ్లి విషయంలో మాత్రం ఏకభిప్రాయంతో సమాధానం చెప్పారు. సరైన అవగాహన లేకుండా  చేసాము అంటూ చెబుతున్నారు. ఇక రెండో పెళ్లి పై మాట్లాడుతూ నోయల్ ఇంత జరిగాక అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని కాకపోతే చైనీస్ వారు ఒక పింగాని పాత్ర పగిలిపోతే దానిని బంగారంతో అతుకు వేస్తారు దానివల్ల దానికి మరింత విలువ పెరుగుతుందని అలా ఒకసారి నా మనసు ముక్కలైంది.కాబట్టి దానికి అతుకు ఎంత గొప్పగా ఆ దేవుడు వేస్తాడో చూడాలి అని చెప్పాడు.

చెప్పకనే రెండో పెళ్ళికి సిద్ధం అన్నట్లు చెప్పి ఎస్తేర్ గురించి ప్రస్థావించడం ఇష్టం లేదని, ఇంట్లో కొన్నిరోజులు అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసంగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేసాడు. ఇక ఎస్తేర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ కుటుంబం కోసం సొసైటీ కోసం కొన్ని చేశాను కానీ అదే జీవితం కాదు నాకు నచ్చినది చేయడం జీవితం అని అర్థమైంది అంటూ చెప్పింది. మళ్ళీ పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది. కాకపోతే ఈసారి మునుపటిల తప్పు చేయనని ఎలాంటి వాడు కావాలో క్లారిటీ ఉందని చెప్పింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago