Neol & Esther : పెళ్లి జీవితంలో అతిపెద్ద నిర్ణయం. అయితే ప్రస్తుత పరిస్థితులలో పెళ్లి ఎంత త్వరగా చేసుకుంటున్నారో అంతే త్వరగా విడిపోడానికి సిద్ద మైపోతున్నారు. కెరీర్, వ్యక్తిగత స్వేచ్చా దీనికి కారణంగా ఉన్నాయి. ఇక సాధారణ జనంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక సెలబ్రిటీల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ప్రేమించుకోడానికి పెళ్లి చేసుకోడానికి సమయం పట్టదు వీరికి అలాగే వీడిపోడానికి కూడా సమయం పట్టడడం లేదు. ఎంతో మంది సెలబ్రిటీల పరిస్థితి నేడు ఇలానే ఉంది కలిసి సర్దుబారు చేసుకోలేకపోవడం వల్ల విడిపోయి జీవిస్తున్నారు.

పెళ్లి చేసుకుసుకుని అతిపెద్ద తప్పు చేసాము…
సింగర్ మరియు రాపర్ అయిన నోయల్, హీరోయిన్ ఎస్తేర్ ను వివాహం చేసుకున్నారు. మొదట్లో బాగానే ఉన్న వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. అయితే వీళ్ళు వీడిపోయిన తరువాత ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా సోషల్ మీడియా మాత్రం వీళ్ళను వదలడం లేదు వారు వీడిపోవడానికి కారణాలు, ఇక రెండో పెళ్లి గురించి రక రకాల ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. అయితే వేరు వేరు అభిప్రాయాలతో వీడిపోయిన వీరిద్దరూ వారి పెళ్లి విషయంలో మాత్రం ఏకభిప్రాయంతో సమాధానం చెప్పారు. సరైన అవగాహన లేకుండా చేసాము అంటూ చెబుతున్నారు. ఇక రెండో పెళ్లి పై మాట్లాడుతూ నోయల్ ఇంత జరిగాక అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని కాకపోతే చైనీస్ వారు ఒక పింగాని పాత్ర పగిలిపోతే దానిని బంగారంతో అతుకు వేస్తారు దానివల్ల దానికి మరింత విలువ పెరుగుతుందని అలా ఒకసారి నా మనసు ముక్కలైంది.కాబట్టి దానికి అతుకు ఎంత గొప్పగా ఆ దేవుడు వేస్తాడో చూడాలి అని చెప్పాడు.

చెప్పకనే రెండో పెళ్ళికి సిద్ధం అన్నట్లు చెప్పి ఎస్తేర్ గురించి ప్రస్థావించడం ఇష్టం లేదని, ఇంట్లో కొన్నిరోజులు అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసంగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేసాడు. ఇక ఎస్తేర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ కుటుంబం కోసం సొసైటీ కోసం కొన్ని చేశాను కానీ అదే జీవితం కాదు నాకు నచ్చినది చేయడం జీవితం అని అర్థమైంది అంటూ చెప్పింది. మళ్ళీ పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది. కాకపోతే ఈసారి మునుపటిల తప్పు చేయనని ఎలాంటి వాడు కావాలో క్లారిటీ ఉందని చెప్పింది.



























