Hero Sri Vishnu: అంత నీచంగా మాట్లాడుతావా.. శ్రీవిష్ణుపై నెటిజన్ల ట్రోలింగ్..కారణం ఏంటో తెలుసా..!
Hero Sri Vishnu: టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తారని హీరో శ్రీ విష్ణుకు పేరుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటనను మొదలుపెట్టి హీరోగా ఎదిగారు శ్రీవిష్ణు. తన సినిమాలను సైలెంట్ గా విడుదల చేస్తూ హిట్ కొడుతుంటాడు. శ్రీ విష్ణు నటించిన బ్రోచేవారెవరురా, అప్పట్లో ఒకడుండేవాడు ఇటీవల విడుదలైన రాజరాజచోర సినిమాలు హిట్ సాధించాయి.
డిపరెంట్ కథలతో వచ్చిన శ్రీ విష్ణు టాలీవుడ్ తో హిట్లు కొట్టాడు. శ్రీ విష్ణు సినిమా వస్తుందంటే చాలు మినిమం గ్యారెంటీ అని ప్రేక్షకులు అనుకుంటారు. తాజాగా ఆయన నటించిన మూవీ ’అర్జున ఫాల్గుణ‘. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లోని పలు సన్నివేశాలు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫ్యాన్ గా శ్రీవిష్ణు కనిపిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ లోని ఓ సన్నివేశమే శ్రీ విష్ణుకు తలనొప్పిని తెచ్చి పెట్టింది. సినిమాలో హీరోయిన్లు ఏం చేస్తున్నారు అని అడగ్గా.. హీరోయిన్ గ్రామ వాలంటరీగా పనిచేస్తున్నానని బదులు ఇస్తుంది. దీనికి ప్రతిగా ఇంటింటికీ వెళ్లి కోటా సరుకులిస్తారు అదేనా..?’ అని వెటకారంగా అడుగుతాడు. ఇప్పుడు ఈ డైలాగే చర్చకు దారి తీసింది.
గ్రామ వాలంటర్ ఉద్యోగం గురించి చీప్ గా మాట్లాడారంటూ..ప్రజలు శ్రీవిష్ణును ట్రోలింగ్ చేస్తున్నారు. కొంతమంది గ్రామ వాలంటీర్లు చేసిన సేవలను శ్రీ విష్ణుకు గుర్తు చేస్తున్నారు. మరికొంత మంది కరోనా కాలంలో వారు చేసిన సేవలను హీరో శ్రీ విష్ణుకు తెలియజేస్తున్నారు. కొంతమంది గ్రామవాలంటీర్ల సేవలకు సంబంధించిన పేపర్ కటింగ్స్ ను పంపుతూ .. శ్రీవిష్ణును ట్యాగ్ చేస్తున్నారు. దీంతో సినిమా యూనిట్ ట్రబుల్ లో పడింది. అయితే మేం సినిమాలో గ్రామ వాలంటరీ ఉద్యోగాన్ని గౌరవంగానే చూపించామని.. సినిమా చూస్తే తెలుస్తుందంటూ.. చెబుతున్నారు. ఈవివాదం ఎప్పుడు,ఎక్కడ ముగుస్తుందో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…