ఇటీవల నాగచైతన్య, సాయి పల్లవి నటించిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా థియేటర్లలో కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని దర్శకుడు శేఖర్‌కమ్ముల తెరకెక్కించగా.. సీహెచ్. పవన్ అందించిన బాణీలు ప్రతీ ఒక్కరికీ అలరించాయి. అయితే ఈ మూవీపై ఓ చిన్నారి తీవ్రపదజాలంతో శేకర్ కమ్ములపై విరుచుకుపడ్డాడు. ఎందుకంటే.. సినిమాలో లక్ష్మీదేవి, ఏసుక్రీస్తు చిత్రపటాలను పక్కపక్కన పెట్టడాన్ని తప్పుపట్టాడు.
అతడి నోటి వెంట అసభ్యకరమైన పదాలు వచ్చాయి. వాటిని ఎవరో చెప్పగా.. బట్టీపట్టి మరీ విచిత్రమైన వేషంలో వచ్చి వీడియోను రికార్డు చేశారు. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒక నిమిషం నిడివి ఉంది. దీనికి నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
అతడు చిన్న పిల్లాడు.. చెప్పినవి చెప్పినట్టుగా చెబుతున్నాడు.. ఇలాంటి వాటికి అలవాటు చేయడానికి ప్రోత్సహించిన అతడి తల్లిదండ్రులను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తల్లిదండ్రులు.. పిల్లలకు నేర్పించేది ఇలానేనా.. అంటూ.. తాము సినిమా చూశామని.. తాము కూడా హిందువులమే కానీ మాకుతప్పు అనిపించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మతం గురించి ప్రస్తావన సినిమాలో ఎక్కడా రాలేదని.. హీరోయిన్ హిందువు.. హీరో క్రిష్టియన్ ఇద్దరు కలిసి వ్యాపారం ప్రారంభిస్తారు.. వారి వారి నమ్మకాలకు అనుగుణంగా పూజలు చేశారు.. వాటిలో ఏ మాత్రం మాకు తప్పు అనిపించలేదని ఘూటుగానే కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి నుంచే చిన్న పిల్లలకు ఇలా చెప్పి.. వారి జీవితాలను నాశనం చేయవద్దని వారి తల్లిదండ్రులను వేడుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…