ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఇప్పటివరకు మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్ చేసే విధానం ఉండగా, ఇకపై అదనంగా ప్రత్యేక పాస్‌వర్డ్ సెట్ చేసుకునే అవకాశం ఇవ్వనుంది.
ఈ ఫీచర్ ద్వారా 6 నుంచి 20 అక్షరాల వరకు ఉండే ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కనీసం ఒక అక్షరం, ఒక సంఖ్య తప్పనిసరిగా ఉండాలి. ఈ ఆప్షన్ పూర్తిగా స్వచ్ఛందం. అదనపు భద్రత కావాలనుకునే వారు సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎనేబుల్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ సదుపాయం బీటా దశలో ఉంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు ట్రయల్ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చినట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. లాగిన్ సమయంలో సాధారణంగా వచ్చే 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ ఇచ్చిన తర్వాత, కొత్తగా సెట్ చేసిన పాస్‌వర్డ్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే టూ-ఫ్యాక్టర్ పిన్ వాడుతున్నవారికి ఇది మరింత రక్షణగా నిలుస్తుంది.
సిమ్ స్వాప్ మోసాలు, అనధికార లాగిన్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అకౌంట్ సెక్యూరిటీ పెంపు దిశగా ఇది కీలక అడుగుగా చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే, మెసేజ్ షెడ్యూలింగ్ ఫీచర్‌పై కూడా కంపెనీ పని చేస్తోంది. వినియోగదారులు ముందుగానే తేదీ, సమయం నిర్ణయించి మెసేజ్‌ను ఆటోమేటిక్‌గా పంపే విధానం అందుబాటులోకి రానుంది. అలాగే స్పాయిలర్ టెక్స్ట్ అనే కొత్త ఫార్మాటింగ్ సదుపాయం ద్వారా మెసేజ్‌లోని కొంత కంటెంట్‌ను దాచిపెట్టి, ట్యాప్ చేసిన తర్వాత మాత్రమే చూపించే ఫీచర్ కూడా రానుంది.
మొత్తానికి, వినియోగదారుల గోప్యత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వాట్సాప్ తీసుకొస్తున్న ఈ మార్పులు త్వరలో అందరికీ అందుబాటులోకి రానున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…