Niharika konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల బుల్లితెర పై అడుగుపెట్టి ఆ తరువాత సినిమాలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. సినిమాల్లో పెద్దగా రాణించకపోవడంతో ఇక మల్లీ సోషల్ మీడియాను నమ్ముకుంది వివిధ వెబ్ సిరీసుల్లో నటిస్తూ వచ్చింది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని, చైతన్య జొన్నలగడ్డతో వివాహం తరువాత కూడా సినిమాల్లోకి రావాలనుకుంటోంది ఈ మెగా డాటర్. ఇక వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తోంది.
ఇక తన లైఫ్ ఇలా సాగుతూ ఉంటే ఇటీవలే సోషల్ మీడియాలో తాను పెట్టిన జిమ్ ట్రైనర్ తో వీడియో వల్ల విమర్శల పాలై ఏకంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇక ఆ వివాదం ముగిసేలోపే రాడిసన్ బ్లూ హోటల్ మింక్ అండ్ పుడ్డింగ్ పబ్ వివాదం మొదలైంది. పబ్ లో పొద్దుపోయేదాకా నడిపారని పోలీసులు దాడి చేయగా సెలబ్రిటీల పిల్లలు దొరకడంతో ఈ ఇష్యూ సంచలనం అయింది. నిహారిక సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు పోలీసుల దాడిలో దొరికారు ఇక ఈ పబ్ ఉదంతంలో డ్రగ్స్ పట్టుబడటంతో మరింత కలకలం రేగింది.
మీడియా నిహారికను మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడంతో కొన్నాళ్ళుగా నిహారిక బయటి ప్రపంచానికి దూరంగా ఉంటోంది. ఇంట్లో నుండి బయటకు అడుగుపెట్టాలంటే ఆంక్షలతో అనుమతిస్తున్నారంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ మళ్ళీ నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఐఆమ్ బ్యాక్ అంటూ వచ్చేసింది. ఇక తన భర్త చైతు జొన్నలగడ్డతో కలిసి జోర్డాన్ విహారయాత్రకు వెళ్లిన నిహారిక అక్కడి అందాలను ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది.
ఎక్కడుంటే అక్కడ స్వర్గాన్ని వెతుక్కుంటా….
ఇక జోర్డాన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ నిహారిక నేను ఎక్కడున్నా స్వర్గాన్ని వెతుక్కుంటా అంటూ కాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలకు చాలా మంది నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు కొందరు పాజిటివ్ కామెంట్స్ పెడుతుంటే మరికొందరు మరోసారి దొరికితే స్వర్గాన్ని వెతుక్కుంటావులే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక నిహారిక ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నేను సోషల్ మీడియా కామెంట్స్ పట్టించుకోను అసలు చూడను అంటూ మాట్లాడిన విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…