Niharika : ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లిగా ఒరే అన్నయ్య అంటూ చిలిపి అల్లరి చేస్తూ అందరిని ఆకట్టుకున్న అమ్మాయి నిహారిక. మోహన్ బాబు నటించిన యామజాతకుడు, వెంకటేష్ ప్రేమించుకుందాం రా సినిమాలతో అలరించిన ఈ అమ్మాయి ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు. సినిమాలకు దూరమై చదువుకుని కెరీర్ పై దృష్టి పెట్టి సెటిల్ అయింది.
అందుకే సినిమాల్లో నటించలేదు….
ఇక ప్రేమించుకుందాం రా సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పార్టీ చేసుకున్నారు సినిమా యూనిట్. ఇక ఆ పార్టీలో చాలా రోజుల తరువాత మీడియాకు నిహారిక కనిపించింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలోకి పెళ్లి చేసుకుని వెళ్లిన నిహారికకు ఇద్దరు పిల్లలు. తన భర్తకు అల్లు అర్జున్ స్నేహితుడట. చాలా సంవత్సరాల తరువాత కనిపించిన నిహారిక పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమాల్లో నటించకపోడానికి కారణాలు వివరించింది. సినిమాల విషయంలో మొదటి నుండి తన కుటుంబానికి ఇష్టం లేదని ఆయా సినిమాలో ఎవరో ఒక తెలిసిన వ్యక్తి బలవంతం మీదనే తన తండ్రి సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారట.
ఇక ఒక్కడు సినిమా తరువాత అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపలేదని చదువుపై దృష్టి పెట్టాలని సినిమాలు వద్దనుకున్నట్లు చెప్పింది. ఇపుడు ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నారా అని అడుగగా ఆ ఆలోచన లేదని, ఇప్పటివరకు లేదని చెప్పింది. ప్రస్తుతం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఫిల్మ్ స్కూల్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు వివరించింది. ఇక నిహారిక ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ఒక్కడు లో తన అన్నయ్య మహేష్ బాబునే. అందుకే ఆ సినిమాను 10 తరగతి అయినా సినిమా చేయాలని ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ చేసిందట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…