Categories: FeaturedMovie News

Adhire Abhi : జబర్దస్త్ లో బూతులు, డబల్ మీనింగ్ డైలాగులకు కారణం అదే.. అదిరే అభి షాకింగ్ కామెంట్స్.!

Adhire Abhi : తెలుగు బుల్లితెరపై సంచలనం జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ జీవితాలు మారిపోయాయి. సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది కమెడియన్స్ ను అందించింది. అదికాక ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తోంది. టీఆర్పి లో టాప్ రేంజ్ లో కొన్ని ఏళ్లుగా దూసుకుపోతున్న జబర్దస్త్ షోలో ప్రస్తుతం పాత కమెడియన్స్ పోయి కొత్త వాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే జబర్దస్త్ గురించి ఆసక్తికర విషయాలను సీనియర్ టీం లీడర్ అదిరే అభి ఇంటర్వ్యూల్లో తెలిపారు.

బూతులు, డబల్ మీనింగ్ మాటలు….

జబర్దస్త్ లో ఆరోగ్యకరమైన కామెడీ మొదట్లో ఉండేది కానీ ఆ తరువాత మెల్లగా డబల్ మీనింగ్ డైలాగులు, బూతు మాటలు ఎక్కువయ్యాయి. దీంతో ఫ్యామిలీ ప్రేక్షకులతో కలిసి చూడాలంటే ఇబ్బందికరంగా మారింది. కొంతమంది కమెడియన్స్ హెల్తీ కామెడీ చేస్తున్నా చాలా వరకు అసభ్యకర మాటలతో, ఆడవాళ్ళ పై జోకులతో బాడీ షేమింగ్ వంటి హాస్యం తో సాగేది. అయితే ఈ మధ్య జబర్దస్త్ లో మార్పు కనిపిస్తోంది. బూతులు తగ్గించినట్లు అనిపిస్తుంది. ఇక ఈ విషయం పై జబర్దస్త్ టీం లీడర్ అదిరే అభి స్పందించారు.

షో ని ఫ్యామిలీ ప్రేక్షకులు చూడలేక పోతున్నారని మేనేజ్‌మెంట్ దృష్టికి వెళ్లడంతో కమెడియన్స్ కు బూతులు ఎక్కువ ఉపయోగించరాదని కొత్తగా కామెడీ చేసి ఆకట్టుకోవాలి కానీ అభ్యంతరకర హాస్యం చేయరాదని సూచించినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ కళ మసకబారిందనే చెప్పాలి. బాగా ఫేమస్ అయిన కమెడియన్స్ సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆది వంటి వారు షోలో లేరు. ఇక జడ్జెస్ కూడా కొత్తవారు కావడంతో జబర్దస్త్ కి పూర్వ వైభవం లేదు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago