Adhire Abhi : తెలుగు బుల్లితెరపై సంచలనం జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ జీవితాలు మారిపోయాయి. సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది కమెడియన్స్ ను అందించింది. అదికాక ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తోంది. టీఆర్పి లో టాప్ రేంజ్ లో కొన్ని ఏళ్లుగా దూసుకుపోతున్న జబర్దస్త్ షోలో ప్రస్తుతం పాత కమెడియన్స్ పోయి కొత్త వాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే జబర్దస్త్ గురించి ఆసక్తికర విషయాలను సీనియర్ టీం లీడర్ అదిరే అభి ఇంటర్వ్యూల్లో తెలిపారు.

బూతులు, డబల్ మీనింగ్ మాటలు….
జబర్దస్త్ లో ఆరోగ్యకరమైన కామెడీ మొదట్లో ఉండేది కానీ ఆ తరువాత మెల్లగా డబల్ మీనింగ్ డైలాగులు, బూతు మాటలు ఎక్కువయ్యాయి. దీంతో ఫ్యామిలీ ప్రేక్షకులతో కలిసి చూడాలంటే ఇబ్బందికరంగా మారింది. కొంతమంది కమెడియన్స్ హెల్తీ కామెడీ చేస్తున్నా చాలా వరకు అసభ్యకర మాటలతో, ఆడవాళ్ళ పై జోకులతో బాడీ షేమింగ్ వంటి హాస్యం తో సాగేది. అయితే ఈ మధ్య జబర్దస్త్ లో మార్పు కనిపిస్తోంది. బూతులు తగ్గించినట్లు అనిపిస్తుంది. ఇక ఈ విషయం పై జబర్దస్త్ టీం లీడర్ అదిరే అభి స్పందించారు.

షో ని ఫ్యామిలీ ప్రేక్షకులు చూడలేక పోతున్నారని మేనేజ్‌మెంట్ దృష్టికి వెళ్లడంతో కమెడియన్స్ కు బూతులు ఎక్కువ ఉపయోగించరాదని కొత్తగా కామెడీ చేసి ఆకట్టుకోవాలి కానీ అభ్యంతరకర హాస్యం చేయరాదని సూచించినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ కళ మసకబారిందనే చెప్పాలి. బాగా ఫేమస్ అయిన కమెడియన్స్ సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆది వంటి వారు షోలో లేరు. ఇక జడ్జెస్ కూడా కొత్తవారు కావడంతో జబర్దస్త్ కి పూర్వ వైభవం లేదు.



























