Niharika: మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతునే ఉంది. నిహారిక వివాహం జరిగిన దగ్గర నుండి ఇప్పటివరకు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు వైరల్ అవుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా నిహారిక విడాకుల వార్తలు వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో నిహారిక షేర్ చేసే గ్లామర్ ఫోటోలు, ఆసక్తికర పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి.
చైతన్య తో విడాకుల వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో కెరీర్ లో ముందడుగు వేస్తూ కొత్త ఆఫీస్ ప్రారంభించింది. అయితే ఆఫీస్ ప్రారంభోత్సవంలో భర్త చైతన్యతో పాటు మెగా కుటుంబ సభ్యులు ఎవరు కనిపించకపోవడంతో అవి వైరల్ అయ్యాయి. ఆ తరువాత డెనిమ్ జీన్స్ లో హాట్ ఫొటోలు షేర్ చేసి వార్తల్లో నిలిచింది. ఇక తాజాగా నిహారిక షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఐ యామ్ డెత్డ్ బంగారం’ అని కామెంట్ పెట్టి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నిహారిక బంగారం అని ఎవరిని సంభోదించారన్న సందేహాలు నెటిజన్స్ లో మొదలయ్యాయి. అయితే ఈ ఫోటోలో ఆమె జిమ్ చేసి అలసిపోయి ఈ కామెంట్ చేశారని అర్థం అవుతుంది. అయితే నిహారిక ప్రేమ కురిపించిన ఆ బంగారం ఎవరూ అనే విషయం గురించి చర్చ జరుగుతోంది. ఇప్పటికే విడాకులు వార్తలు వైరల్ అవుతుండగా నిహారిక మళ్లీ ఇలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఆ వార్తలకి మరింత బలం చేకూరినట్టు అనిపిస్తోంది.
ఇదిలా ఉండగా నిహారిక విడాకుల వార్తలపై ఇప్పటివరకు స్పందించలేదు. అంతేకాకుండా తన కెరీర్ మీద ఫోకస్ పెట్టి నిర్మాతగా రాణించటం కోసం ప్రయత్నాలు చేస్తోంది. పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన నిహారిక ఆ నిర్మాణ సంస్థ ద్వారా వెబ్ సిరీస్, సినిమాలు నిర్మిస్తోంది. తాజాగా ప్రొడక్షన్ హౌస్ కోసం కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించింది. వృత్తిపరమైన జీవితంలో ముందుకు వెళుతున్న నిహారిక వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయిందనే తెలుస్తుంది.
భారతదేశంలో ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన నగరాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది కాశీ. వేల ఏళ్ల చరిత్ర, అనేక పురాణ…
ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. జిమ్‌లకు వెళ్లేవారు మాత్రమే కాదు, బరువు తగ్గాలని భావించే వారు కూడా…
ఉదయం టీతో రెండు బిస్కెట్లు, సాయంత్రం కాఫీకి మరికొన్ని – ఇది చాలామందికి రోజువారీ అలవాటు. పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో…
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…
హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ…
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ…