Movie News

Sudigali Sudheer: లక్కీ ఛాన్స్ కొట్టేసిన సుడిగాలి సుధీర్..ఏకంగా ప్రభాస్ డైరెక్టర్ తో సినిమా చేసే ఛాన్స్..?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. ఈ పేరు గురించి తెలియని వారంటూ ఉండరు. మెజీషియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుధీర్… ‘జబర్దస్త్’ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కమెడియన్ గా ఫేమస్ అయ్యాడు. జబర్దస్త్ ద్వారా టీం లీడర్ గా, కమెడియన్ గా కన్నా రష్మి లవర్ గా మరింత ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో సినిమాలలో నటించే అవకాశాలు అందుకొని కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించి హిట్ అందుకున్నాడు.

సుధీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం సుధీర్ టీవీ షోలతో దూరంగా ఉంటూ కేవలం సినిమాల మీదే ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ‘ కాలింగ్ సహస్ర’ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. సుధీర్ టీవీ షోలకు దూరంగా ఉండటంతో అతని గురించి ఎక్కువ వార్తలు బయటికి రావటం లేదు. అయితే తాజాగా సుధీర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

తాజాగా సుధీర్ ఒక లక్కీ ఛాన్స్ అందుకున్నాడని ఏకంగా ప్రభాస్ ని డైరెక్ట్ చేసిన దర్శకుడుతో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. గాలోడు సినిమా ద్వారా సుధీర్ హిట్ కొట్టడంతో పలువురు దర్శకులు సుదీర్ తో సినిమా చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు దశరథ్ కూడా సుధీర్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Sudigali Sudheer: సుధీర్ తో హిట్ కొట్టేనా…


మంచు మనోజ్ హీరోగా శౌర్య, అలాగే ప్రభాస్ హీరోగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దశరథ్ అప్పటినుండి మరొక సినిమాకు దర్శకత్వం వహించలేదు. ఇలా చాలా కాలంగా ఫేడవుట్ అయిపోయిన దశరథ్ ఇప్పుడు మళ్లీ సుధీర్ ద్వారా ఇండస్ట్రీలో హిట్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో కంబ్యాక్ ఇవ్వటానికి సుధీర్ తో సినిమా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సుధీర్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే అని చెప్పాలి. మిస్టర్ పర్ఫెక్ట్ వంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన దశరథ్ సుధీర్ కి కూడా హిట్ ఇస్తాడో లేదో చూడాలి మరి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago