మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె చేసే అల్లరి గురించి మనందరికీ తెలిసిందే. ఈమె బుల్లితెర పై యాంకర్ ఎంతోమంది ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ, ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే ఇటీవలే ఈమె జొన్నలగడ్డ నాగచైతన్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
పెళ్లికి ముందు సినిమాలలో, సిరీస్ లో నటించిన నిహారిక పెళ్లి తర్వాత కూడా నటిగా, నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇటీవల తాజాగా నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ ప్రస్తుతం జి5 యాప్ లో స్త్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గానే రెస్పాన్స్ వస్తోంది.
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ లాంచ్ కు మా పెదనాన్న చిరంజీవిని పిలవకపోవడం గురించి నిహారిక స్పందించింది. పెదనాన్న చాలా బిజీగా ఉంటారని వెబ్ సిరీస్ లాంచ్ కి రావాలని పిలుస్తే పెదనాన్న కానీ బాబాయ్ కానీ నో చెప్పరని అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని నిహారిక తెలిపింది. చిరంజీవిని తాను డాడీ అనీ పిలుస్తానని తెలిపింది.
తన అన్న వరుణ్ తేజ్ చిరంజీవినీ డాడీ అని పిలవడం తో తనకు కూడా అలాగే అలవాటయిపోయింది నిహారిక చెప్పుకొచ్చింది. ఆహా ఓటీటీ ఉండగా జి5 యాప్ కు వెబ్ సిరీస్ ఇవ్వడం గురించి నిహారిక స్పందిస్తూ.. ఆహా ఓటీటీ కి ఇస్తే అయిన వాళ్ళు కాబట్టి ఇచ్చారని అంటారని లేకపోతే ఇతరులకు ఎందుకు ఇచ్చారని అంటారు అంటూ నిహారిక తెలిపింది. తాను గతంలో చేసిన వెబ్ సిరీస్ లు జీ 5 యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయని ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కంటెంట్ విషయంలో జీ ఫైవ్ నిర్వాహకుల సూచనలు తీసుకున్నామని అందువల్ల జీ 5 వాళ్లకు ఈ వెబ్ సిరీస్ ను ఇచ్చామని నిహారిక తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…