తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమెకు ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళంలో కూడా సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది.
ఆమెకు ఉన్న ఆ క్రేజ్ తోనే భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకు సాయిపల్లవి నటించిన సినిమాల్లో దాదాపుగా అన్ని సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. సాయి పల్లవి డాన్స్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈమె సినిమాల్లో నటించే ముందు ఈమెకు కథ నచ్చితేనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇటీవలే చిరంజీవి లాంటి పెద్ద స్టార్ హీరో సినిమాను కూడా వద్దని చెప్పింది.
ఇది ఇలా ఉంటే సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ అక్క చెల్లెలు ఇద్దరు చూడటానికి ఒకేలా కనిపిస్తుంటారు. అయితే గతంలోనే పూజ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. తాజాగా అధికారికంగా ప్రకటన రావడంతో ఇది కాస్త కన్ఫామ్ అయ్యింది. తమిళ ఇండస్ట్రీ లోకి పూజా కన్నున్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఫైట్ మాస్టర్ స్టంట్ సిల్వ దర్శకుడి దర్శకత్వంలో చిత్తరాయి సెవ్వనం అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో సముద్రకని, పూజా కన్నన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో వీరు తండ్రి కూతురుగా నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 3న జీ5 లో విడుదల కానుందని చిత్ర బృందం వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…