Nirupam Paritala : ఈటీవీలో చంద్రముఖి సీరియల్ తో పరిచయమైన నిరుపమ్ పరిటాల. రచయిత నటుడు ఓంకార్ పరిటాల కుమారుడు. ఓంకార్ గారు విలన్ గా నటించిన సీరియల్స్ అన్ని హిట్ సీరియల్స్ గా నిలిచాయి. పలు సినిమాల్లోనూ నటించిన ఓంకార్ అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన వారసుడిగా అడుగుపెట్టిన నిరుపమ్ చంద్రముఖి సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సీరియల్ లో నటిస్తున్న సమయంలోనే కో ఆర్టిస్ట్ మంజులతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.
బుల్లితెర శోభన్ బాబు….
ఇక అటు సీరియల్స్ చేస్తూనే సినిమా అవకాశాలను అందుకున్నాడు నిరుపమ్. అష్ట చెమ్మ సినిమాలో తొలుత హీరోగా నిరుపమ్ చేయాల్సి ఉన్నా ఆల్రెడీ సీరియల్స్ లో పరిచయమవడంతో నిరుపమ్ ను తొలగించి నాని ని హీరోగా పెట్టుకున్నారట. ఇక మా టీవీలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ తో డాక్టర్ బాబు గా క్రేజ్. కార్తీక దీపం సీరియల్ దక్షిణాదిన అన్ని భాషలలోనూ వచ్చింది. అన్ని భాషల్లోనూ హిట్. కానీ తెలుగులో మాత్రం సూపర్ హిట్ అయింది. ఒకానొక సమయంలో బిగ్ బాస్ వంటి రియాలిటీ షో కంటే ఎక్కువ రేటింగ్స్ తో దూసుకెళ్లింది. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు గా నటించిన నిరుపమ్ కు, వంటలక్కగా నటించిన ప్రేమి విశ్వనాథ్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇక బుల్లి తెర శోభన్ బాబు అంటూ నిరుపమ్ కు బిరుదు కూడా ఇచ్చేసారు మహిళా అభిమానులు. ఆ సీరియల్ లో ఇపుడు ఫ్రెష్ స్టోరీని మొదలుపెట్టారు.
పాత పాత్రలను తొలగించి డాక్టర్ బాబు, వంటలక్క పిల్లలైన శౌర్యా హిమలు పెద్దయ్యాక సీరియల్ ను చూపిస్తున్నారు. ఇక డాక్టర్ బాబు సీరియల్ లో కనిపించడం లేదు. దీనికితోడు జీ తెలుగులో ఓన్ ప్రొడక్షన్లో చేస్తున్న హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ ను కూడా ముగించేసారు. ఇక కొత్త ప్రాజెక్ట్స్ లో నటించకపోవడంతో అందరికి అసలు డాక్టర్ బాబు ఇక సీరియల్స్ లో కనిపిస్తాడా లేదా అనే అనుమానం మొదలయింది. దీనికి నిరుపమ్ స్పందించాడు. సీరియల్స్ లో నటించడం ఏమో కానీ సీరియల్స్ నిర్మిస్తానని చెప్పారు. ఇక త్వరలోనే ఒక వెబ్ సిరీస్ తో మీ ముందుకు వస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…