బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కు ఏస్థాయిలో ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బుల్లితెరపై ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ లో కెల్లా టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా ఈ సీరియల్ లో నటించే దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క, డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ అలియాస్ పరిటాల నిరుపమ్ పాత్రలకు అభిమానులు ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. ఈ సీరియల్ లో కార్తీక్ పాత్రలో నటిస్తున్న టువంటి నిరుపమ్ వివిధ సీరియల్స్లో నటిస్తున్నప్పటికీ కార్తీకదీపం గుర్తింపును సంపాదిందని చెప్పవచ్చు.
ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా డాక్టర్ బాబు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ సీరియల్ గురించి వచ్చే కామెంట్లకు స్పందిస్తూ ఉంటారు. గత కొద్ది రోజుల వరకు దీప పై ఉన్న అనుమానంతో కార్తీక్ తనని ఎన్నో విధాలుగా హింసిస్తాడు. ప్రస్తుతం గతంలో దీప ఎదుర్కొన్న అవమానాన్ని కార్తీక్ ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ దీప కార్తీక్ కు మద్దతుగా నిలిచి కార్తీక్ తప్పు చేయలేదని చెబుతుంది. ఇదిలా ఉండగా తాజాగా డాక్టర్ బాబు స్పందిస్తూ.. వంటలక్క గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక దీపం డాక్టర్ బాబు కార్తీకదీపం సీరియల్ గురించి ముచ్చటించారు. ప్రస్తుతం ఈ సీరియల్లో నేను చేస్తున్న పాత్ర నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.ఎందుకంటే మగవాళ్లు ఏడవడం వల్ల సీరియల్ పై ఇంత అభిమానం ఉంటుందని నాకు ఇప్పుడే తెలుస్తోంది అంటూ సంబరపడ్డారు.
ప్రస్తుతం ఈ సీరియల్ లో దీప తనతో ఓవర్ గా ఉండడం లేదని, కానీ ఒకప్పుడు ఇదే బాధతో దీప నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా ఓవర్ గా బిహేవ్ చేశానని తెలిపారు. పాత్రకు అనుగుణంగా అలా నడుచుకోవాల్సి వచ్చిందని.. ప్రస్తుతం దీప పై నేను చూపిస్తున్న కేరింగ్ అలాగే ఉండాలని ప్రేక్షకులు గట్టిగా కోరుకుంటున్నట్లు తెలిపాడు. కానీ అప్పుడే అంత ఓవర్ కేరింగ్ ఉండకూడదంటూ వంటలక్క గురించి డాక్టర్ బాబు కామెంట్ చేశారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…