Movie News

Nithin: ఆ హీరో వల్లే నేను హీరో అయ్యాను మా నాన్న నిర్మాతగా సెటిల్ అయ్యారు… నితిన్ కామెంట్స్ వైరల్!

Nithin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి నికితారెడ్డి నిర్మాణంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం హాజరై సందడి చేశారు. ఇకపోతే ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ నెగిటివ్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నితిన్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు. నేను సినిమా ఇండస్ట్రీకి హీరోగా రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో రాజశేఖర్ గారు కూడా ఒకరు అంటూ ఈ సందర్భంగా నితిన్ వెల్లడించారు.

నేను సినిమా ఇండస్ట్రీకి హీరోగా రావడమే కాకుండా మా నాన్న కూడా నిర్మాతగా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి కూడా రాజశేఖర్ గారు కారణం అని ఈయన తెలియజేశారు. రాజశేఖర్ గారు నటించిన మగాడు సినిమాకు మా నాన్న మొట్టమొదటిసారి డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో మా నాన్నకు సినిమాలపై ఆసక్తి పెరిగి ఇదే రంగంలోకి వచ్చే సెటిల్ అయ్యారని తెలిపారు.

డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు..

ఒకవేళ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయ్యి ఉంటే నాన్న తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ధైర్యం చేసేవారు కాదని నాకు కూడా సినిమా ఇండస్ట్రీ పై పెద్దగా ఆసక్తి కూడా ఉండేది కాదేమో అంటూ నితిన్ తెలిపారు. ఇండస్ట్రీలో తాను హీరోగా ఉన్నాను అంటే అందుకు రాజశేఖర్ గారు కూడా కారణమే అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago