Suma -Brahmaji: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సుమా కనకాల ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు. ఇలా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ఇప్పుడు కూడా తప్పులు మాట్లాడకుండా ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసేవారు. కానీ ఇటీవల కాలంలో సుమ ఏ కార్యక్రమానికి వెళ్లిన కొన్ని సార్లు తడబడుతున్నారని తెలుస్తోంది.
ఇకపోతే తాజాగా సుమ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి సుమ అడ్డ అనే కార్యక్రమానికి ఎక్స్ట్రా ఆర్డినరీ చిత్ర బృందం ప్రమోషన్లలో భాగంగా హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగా డైరెక్టర్ వక్కంతం వంశీ హీరో నితిన్ కమెడియన్ హైపర్ ఆది బ్రహ్మాజీ వంటి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మాజీ సుమ పట్ల వేసినటువంటి సెటైర్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
గత కొద్ది రోజుల క్రితం సుమా మీడియా వారిని ఉద్దేశించి స్నాక్స్ భోజనం లాగా చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది కాస్త వివాదంగా మారడంతో సుమ చివరికి క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా బ్రహ్మాజీ ఈ వివాదం గురించి సుమపై సెటైర్స్ వేశారు. ఇందులో భాగంగా బ్రహ్మాజీ తింటూ ఉండగా సుమ జాగ్రత్త బ్రహ్మాజీ గారు తింటూనే ఉన్నారు పళ్ళ సెట్టు ఊడిపోతుంది అంటూ కామెంట్ చేయగా వెంటనే బ్రహ్మాజీ ఇవి స్నాక్స్ మాత్రమే అంటూ సమాధానం ఇచ్చారు.
భోజనం లేదా..
మరోసారి సుమ తిన్నారా అంటూ ప్రశ్నించడంతో స్నాక్స్ మాత్రమే తిన్నాము. భోజనం చేయలేదు అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె జయం సినిమాలో సదా పాత్రను స్పూఫ్ చేశారు. ఆ సమయంలో కూడా బ్రహ్మాజీ స్నాక్స్ మాత్రమే తిన్నాము భోజనం లేదా అంటూ అనడంతో వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ సుమ తెల్ల మొహం వేశారు. ఇలా సుమారు పట్ల సెటైర్స్ వేయడంతో నితిన్ నవ్వుతూనే ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…