Nithya Menon:మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ గురించి పరిచయం అవసరం లేదు. కేవలం తెలుగు, సినిమాలు మాత్రమే కాకుండా తమిళ మలయాళ సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్న నిత్యామీనన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే నిత్యామీనన్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ అందరికి షాక్ ఇచ్చారు.
ఈమె సోషల్ మీడియా వేదికగా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేశారు. అయితే ఇందులో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టుగా చూపించడంతో ఒక్కసారిగా నేటిజన్స్ ఆశ్చర్యపోయారు.అసలు నిత్యామీనన్ కి పెళ్ళెప్పుడు అయింది? ఈ ప్రెగ్నెన్సీ ఏంటి? అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. అయితే ఈమె సోషల్ మీడియా వేదికగా ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేయడం వెనుక విషయం ఉంది.
నిత్యామీనన్ సోషల్ మీడియా వేదికగా ఇలా ప్రెగ్నెన్సీ టెస్ట్ కి షేర్ చేస్తూ ‘అండ్.. ది వండర్ బిగిన్స్..’అంటూ క్యాప్షన్ పెట్టారు. అయితే నిత్యామీనన్ ఇలా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేసినది తన తదుపరి సినిమాలో తన పాత్ర గురించి అని తెలుస్తోంది. ఈమె నటించబోయే తన తదుపరి సినిమాకి సంబంధించిన క్లూ అని అర్థమవుతుంది.
nithya menon: తప్పుడు సమాచారం అవసరమా..
ఇలా ఈమె సినిమాని ప్రమోట్ చేయడం కోసం ఇలా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పెట్టి అందరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున నేటిజన్లు నిత్యమీనన్ వ్యవహార శైలి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం మరి ఇంతగా అభిమానులకు తప్పుడు సంకేతాలను పంపించాలా అంటూ పెద్ద ఎత్తున ఈమె చేసిన పనిపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…