Movie News

Nithya Menon: ఈ ఒత్తిడి నావల్ల కాదు…. ఇండస్ట్రీకి గుడ్ బై…. నటి నిత్యమీనన్ సంచలన వ్యాఖ్యలు?

Nithya Menon: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి నిత్యమీనన్ ఒకరు. ఈమె నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నిత్యమీనన్ అనంతరం కన్నడ మలయాళం తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.

సినిమాలంటే ఏమాత్రం ఆసక్తి లేనటువంటి ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల తమిళంలో ఈమె నటించిన తిరు సినిమాకు గాను ఏకంగా నేషనల్ అవార్డు రావడం విశేషం. ఇక నిత్యా మీనన్ కేవలం సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా పలు వెబ్ సిరీస్ లను నిర్మించారు. అలాగే వెబ్ సిరీస్ లలో నటించారు.

ఇక బుల్లితెర కార్యక్రమాలకి జడ్జిగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నిత్యామీనన్ నటించిన తాజా చిత్రం కాదలిక్క నేరమిల్లై. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలోప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె తన కెరీర్ గురించి పలు విషయాలను వెల్లడించారు.

తనకు సినిమా ఇండస్ట్రీ అంటే ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు. ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఆ ఒత్తిడిని భరించడం నాకు చాలా కష్టమైంది అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లాలని భావించాను. ఒక ప్రశాంతమైన జీవితం గడపడానికి తాను ఇష్టపడతానని అందుకే ఇండస్ట్రీకి దూరం అవ్వాలని అనుకున్నట్లు నిత్యమీనన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇలాంటి ఆలోచనలో ఉన్న నన్ను నేషనల్ అవార్డు పూర్తిగా మార్చేసిందని తెలిపారు. నేషనల్ అవార్డు రావడంతో తన ఆలోచనను మార్చుకున్నాను అని తెలిపారు. నటిగా నాకు ఈ అవార్డు రావడం పట్ల మరింత బాధ్యతను పెంచిందని ఈ సందర్భంగా నిత్యామీనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago