Balakrishna: భయట ఎంత వైలెంట్ గా ఉన్నా.. ఇంట్లో మాత్రం సైలెంట్..అదే మా అగ్రిమెంట్: బాలకృష్ణ
Balakrishna: బాలయ్య మంచి జోష్ లో ఉన్నాడు. ఓ వైపు తను నటించిన అఖండ బంపర్ హిట్ అందుకోవడంతో పాటు.. మరోవైపు తాను హోస్ట్ చేస్తున్న ‘ అన్ స్టాపబుల్’ టాక్ షో కూడా సక్సెస్ అయింది. ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఇటీవల ఇండియాలో ప్రసారం అవతున్న టాప్ షోల్లో ఒకటిగా నిలిచింది. మోహన్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, రాజమౌళి వంటి ప్రముఖులను ఈ షోకు గెస్ట్ లుగా వచ్చారు.
ఇదిలా ఉంటే ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ షోకు రానా అతిథిగా వచ్చాడు. అంతకు ముందు రానా నిర్వహించిన నెం1 యారి షోకు బాలయ్య గెస్ట్ గా హజరైన విషయం తెలిసింది. వీరిద్దరు గతం నుంచి చనువు ఉంది. రామానాయుడి మనవడిగా రానా చిన్నప్పటి నుంచి బాలక్రిష్ణకు తెలుసు. వీరిద్దరు కలిసి ఎన్టీఆర్ కథానాయకుడు, మహా నాయకుడు సినిమాల్లో నటించారు. ఇందులో బాలయ్య ఎన్టీఆర్ పాత్ర పోషించగా… రానా, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ప్లే చేశారు.
అయితే ఇటీవల అన్ స్టాపబుల్ షోకు వచ్చిన రానాతో బాలయ్యకు మధ్య చాలా ఫన్నీ సంభాషణ నడించింది. రానా! నీకు ఓ సలహా ఇవ్వనా? నేను వసుంధరతో పెళ్లైన మొదటి రోజే… ఒక కాంప్రమైజ్‌కు వచ్చేశా. బయట, ఎక్కడికైనా వెళ్లినా… మొత్తం నేనే మాట్లాడతాను, నువ్వు సైలెంట్‌గా ఉండాలని! ఇంట్లో ఆవిడ ఎంత వైలెంట్‌గా ఉన్నా… నేను సైలెంట్‌గా ఉంటాను” – ఇదీ బాలకృష్ణ సలహా! “సార్… ఇది చాలా మంచి టిప్” అని రానా అన్నారు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరబూశాయి.
అప్పుడప్పుడూ సర్రున కోపం వస్తుంది..
దీంతో పాటు రానా కూడా బాలయ్యకు కొన్ని ప్రశ్నలు సంధించాడు. రానా.. ఇంట్లో ముందుగా ఆర్య్గూ చేసేది మీరే కదా.. సారి చెప్పేది మీరే కదా..అని బాలయ్యను ప్రశ్నించగా… బాలయ్య ‘అవును! అంటే… కష్టాన్ని కొనుక్కు తెచ్చుకోవడం! అంటూనే సారి కూడా నేనే మొదటగా చెప్పాల్సి వచ్చేదని’ అన్నాడు. మీకు సహనం అనేది ఉందా? లేదంటే ఎప్పుడూ హై ఎనర్జీలో ఉంటారా? అని రానా ప్రశ్నించగా… బాలయ్య ‘ అప్పుడప్పుడూ సర్రున కోపం వస్తుంది. వీళ్లు మారరని అనుకున్నప్పుడు తగ్గిపోతుంది. కోపం కూడా ఆరోగ్యానికి మంచిది. గుడ్ కొలెస్ట్రాల్ లాగా… గుడ్ బీపీలు. ఇవి డాక్టర్లు చెప్పరు. ఇటువంటి వాటికి మనకి మనమే సరైన వైద్యులం. నేను కూడా అప్పుడప్పుడూ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోతా. ఎవ్వరు వచ్చినా నన్ను డిస్ట్రబ్ చేయవద్దని మా ఆవిడకు కూడా చెప్పేస్తా. నాకు ఒంటరిగా ఉండాలని ఉందని చెబుతా’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ విధంగా ఇద్దరి మధ్య టాక్ షో చాలా ఫన్నీగా నడిచింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…