Niharika: మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వరుస సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా మారి సినిమాలను వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా ద్వారా కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
ఇక ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అన్నింటిని నిహారిక తన భుజాలపై వేసుకొని ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. మెగా కుటుంబంలో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలో ఉన్నారు వీరంతా ఇతర హీరోలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాంటిది మెగా డాటర్ కి మాత్రం ఎలాంటి సపోర్ట్ చేయడం లేదు.
ఇదే విషయం గురించి నిహారికకు ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈమె ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.. నా సినిమాకు సపోర్ట్ చేయడం కోసం మానాన్నే దొరకట్లేదు అంటూ తెలిపారు. నాన్న రాజకీయ పనుల నిమిత్తం మంగళగిరిలోనే ఉంటున్నారని కనీసం ఇంటికి కూడా రావడం లేదని తెలిపారు. ఇక బాబాయ్ కి క్షణం తీరికలేదు.
అందరూ బిజీబిజీ..
అన్నయ్య తన తదుపరి సినిమా కోసం వైజాగ్ లోనే షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక పెదనాన్న రామ్ చరణ్ అన్న పారిస్ ఒలంపిక్స్ వేడుకలలో బిజీ అయ్యారు. ఇక వదిన కాలు ఫ్యాక్చర్ కావడంతో డెహ్రాడూన్ లోనే ఉన్నారని నిహారిక తెలిపారు. ఈ విధంగా వీరందరూ నా సినిమా విడుదల సమయానికి బిజీ అయ్యారని అందుకే ఎవరు సపోర్ట్ చేయలేకపోతున్నారంటూ అసలు విషయం వెల్లడించారు. ఇక వీరందరూ ఫ్రీ అయిన తర్వాత తప్పకుండా నా సినిమా చూపిస్తానని నిహారిక వెల్లడించారు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…