Categories: FeaturedGeneral News

గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు శుభవార్త.. డెలివరీ బాయ్స్ కు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదట..!

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే గత కొన్నిరోజులుగా గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 40 రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 120 రూపాయలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 700 రూపాయలకు అటూఇటుగా ఉంది.

అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు గ్యాస్ సిలిండర్ డెలివరీ బ్యాస్ కు బిల్లులో పేర్కొన్న మొత్తం కంటే 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఎక్కువ మొత్తం చెల్లిస్తుంటారు. అయితే హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. బిల్లుల్లో పేర్కొన్న మొత్తం కంటే అదనంగా డబ్బులను డెలివరీ బాయ్స్ కు గ్యాస్ సిలిండర్ వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదని హెచ్.పీ.సీ.ఎల్ స్పష్టం చేసింది.

హెచ్‌పీసీఎల్ తమ కంపెనీ గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్లు సిలిండర్ ను బుక్ చేసుకున్న వారి ఇంటికి సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. బిల్లులో పేర్కొన్న మొత్తం మాత్రం చెల్లిస్తే చాలని.. అదనంగా ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని గ్యాస్ కంపెనీ పేర్కొంది. హెచ్‌పీసీఎల్ ఆర్‌టీఐ రిప్లేలో గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ఈ విషయాన్ని వెల్లడించింది.

గ్యాస్ సిలిండర్ వినియోగదారులు సైతం డెలివరీ బాయ్స్ కు బిల్లులో పేర్కొన్న మొత్తం కంటే ఎక్కువ మొత్తం చెల్లించకుండా నియమ నిబంధనల గురించి అవగాహన ఏర్పరచుకుంటే మంచిది. మరోవైపు ఆయిల్ కంపెనీలు గతంలో నెలకు ఒకసారి గ్యాస్ సిలిండర్ రేట్లను సవరించగా ప్రస్తుతం వారానికి ఒకసారి గ్యాస్ సిలిండర్ రేట్లను సవరిస్తూ ఉండటం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago