దేశంలో చాలామంది మంచి ఉద్యోగం వచ్చినా, వ్యాపారంలో లాభాలు వచ్చినా భవిష్యత్తు అవసరాల నిమిత్తం డబ్బును పొదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మిగతా స్కీమ్స్ తో పోల్చి చూస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కచ్చితమైన లాభాలను పొందే అవకాశంతో పాటు ఎటువంటి రిస్క్ ఉండదు. అయితే ఇందుకోసం పాలసీని తీసుకునే ముందే నియమనిబంధనల గురించి పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి.
ఎల్‌ఐసీ కస్టమరల కోసం అందుబాటులోకి తెచ్చిన పాలసీల్లో జీవన్ శాంతి పాలసీ ఒకటి. జీవన్ శాంతి పాలసీని ఎంచుకోవడం వల్ల రిటైర్మెంట్ తర్వాత అదిరిపోయే ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుంది. సింగిల్ ప్రీమియం పలసీ అయిన జీవన్ శాంతి పాలసీని ఎంచుకుంటే రిటైర్మెంట్ తరువాత డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీని ఎంచుకునే వాళ్లు ప్రీమియం చెల్లించిన వెంటనే పెన్షన్ వచ్చే ఆప్షన్ ను ఎంచుకోవడం లేదా 5, 10, 15, 20 సంవత్సరాల తర్వాత పెన్షన్ వచ్చేలా ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.
ఈ రెండు ఆప్షన్లలో ఏ ఆప్షన్ ఎంచుకున్నా కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే వ్యక్తిగత అవసరాలు, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆప్షన్ ను ఎంచుకుంటే మంచిది. అయితే 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ పాలసీని తీసుకోవచ్చు. ఉదాహరణకు 30 సంవత్సరాల వ్యక్తి 10 లక్షల రూపాయలు ప్రీమియం చెల్లించి పాలసీ తీసుకుంటే ప్రతి నెలా 4,300 రూపాయల చొప్పున పెన్షన్ పొందవచ్చు.
ప్రీమియం చెల్లించిన ఏడాది నుంచి పెన్షన్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎల్‌ఐసీ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చిన బెస్ట్ పాలసీలలో ఈ పాలసీ కూడా ఒకటని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…