ఎల్‌ఐసీ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఆ స్కీమ్ తో ప్రతి నెలా రూ.4,300 పొందే ఛాన్స్..?

0
77

దేశంలో చాలామంది మంచి ఉద్యోగం వచ్చినా, వ్యాపారంలో లాభాలు వచ్చినా భవిష్యత్తు అవసరాల నిమిత్తం డబ్బును పొదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మిగతా స్కీమ్స్ తో పోల్చి చూస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కచ్చితమైన లాభాలను పొందే అవకాశంతో పాటు ఎటువంటి రిస్క్ ఉండదు. అయితే ఇందుకోసం పాలసీని తీసుకునే ముందే నియమనిబంధనల గురించి పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి.

ఎల్‌ఐసీ కస్టమరల కోసం అందుబాటులోకి తెచ్చిన పాలసీల్లో జీవన్ శాంతి పాలసీ ఒకటి. జీవన్ శాంతి పాలసీని ఎంచుకోవడం వల్ల రిటైర్మెంట్ తర్వాత అదిరిపోయే ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుంది. సింగిల్ ప్రీమియం పలసీ అయిన జీవన్ శాంతి పాలసీని ఎంచుకుంటే రిటైర్మెంట్ తరువాత డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీని ఎంచుకునే వాళ్లు ప్రీమియం చెల్లించిన వెంటనే పెన్షన్ వచ్చే ఆప్షన్ ను ఎంచుకోవడం లేదా 5, 10, 15, 20 సంవత్సరాల తర్వాత పెన్షన్ వచ్చేలా ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.

ఈ రెండు ఆప్షన్లలో ఏ ఆప్షన్ ఎంచుకున్నా కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే వ్యక్తిగత అవసరాలు, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆప్షన్ ను ఎంచుకుంటే మంచిది. అయితే 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ పాలసీని తీసుకోవచ్చు. ఉదాహరణకు 30 సంవత్సరాల వ్యక్తి 10 లక్షల రూపాయలు ప్రీమియం చెల్లించి పాలసీ తీసుకుంటే ప్రతి నెలా 4,300 రూపాయల చొప్పున పెన్షన్ పొందవచ్చు.

ప్రీమియం చెల్లించిన ఏడాది నుంచి పెన్షన్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎల్‌ఐసీ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చిన బెస్ట్ పాలసీలలో ఈ పాలసీ కూడా ఒకటని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here