Movie Tickets: ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి పరోక్ష యుద్దం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వ టికెట్ రేట్ల తగ్గింపు అంశంపై వెనక్కి తగ్గకపోవడంతో టాలీవుడ్ ప్రముఖుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. అయితే ఎవరూ బయటపడటం లేదు. పవన్ కళ్యాన్, నాని, సిద్ధార్ధ్, నితిన్ , కార్తికేయ వంటి కొంతమంది మాత్రం స్పందిస్తున్నారు. మిగతా హీరోలు ఈ అంశం మనది కాదన్న రీతిలో ఉన్నారు.
పవన్ కళ్యాన్ టికెట్ ధరల విషయంలో స్పందించినప్పుడు ఒక్క హీరో కూడా మద్దతు నిలవలేదు.. అప్పుడే సినీ పరిశ్రమ మద్దతు ఇస్తే ఇంత దూరం వచ్చేది కాదని చాలా మంది అనుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో కొన్న పెద్ద ఫ్యామిలీలుగా చెబుతున్న వారు కూడా టికెట్ తగ్గింపు విషయంపై స్పందించడం లేదు. వారి రెమ్యునరేషన్ లో నిర్మాతలు కోత విధిస్తామంటే.. ఏమైనా ముందుకు వస్తారో చూడాలి. ముఖ్యంగా బాలక్రిష్ణ ఈ అంశంపై దూరంగా ఉంటున్నారు.
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలక్రిష్ణ మరింతగా ప్రభుత్వంపై ఫైట్ చేయాల్సి ఉన్నా అసలు ఏం స్పందించడం లేదని వాదన వస్తోంది. మరో వైపు పాన్ ఇండియా మూవీల కోసం ఎగబడుతున్న కుర్ర హీరోలు తమ సంపాదన.. తన ఇమేజ్ గురించి పట్టించుకుంటున్నారు తప్పితే.. పరిశ్రమ మంచి కోసం పాటు పడటం లేదు. మరోవైపు ’మా‘ అధ్యక్ష ఎన్నికల సమయంలో భారీ డైలాగులు చెప్పిన మంచు విష్ణు ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. మోహన్ బాబుకు సీఎం జగన్ తో చుట్టరికం కూడా ఉంది. అయినా కూడా మోహన్ బాబు టికెట్ల ధరల విషయంపై కనీసం సీఎంతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కేవలం పవన్ కళ్యాణ్, నాని వంటి హీరోల సొంత సమస్యగా భావిస్తున్నారు.
గతంలో పవన్ కళ్యాన్ టికెట్ ధరల తగ్గింపు అంశంపై మాట్లాడితే.. ఏపీ మంత్రులు పవన్ కళ్యాన్ పై విమర్శల దాడి చేశారు. ఆసయంలో టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ కూడా సపోర్ట్ గా నిలబడలేదు. తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని ఏపీ సర్కార్ ను విమర్శించారు. సినిమా థియేటర్ల కలెక్షన్… కిరాణా దుకాణాల కలెక్షన్ల కన్నా తక్కువగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఇలా వ్యాఖ్యలు చేశాడో.. తెల్లవారి నుంచి ఏపీలోని థియేటర్ల మీద పెద్ద ఎత్తున రైడ్లు ప్రారంభం అయ్యాయి. ఇది చూస్తే సినిమా ఇండస్ట్రీ పై సర్కార్ ప్రతీకారానికి పాల్పడుతుందా.. అనే అనుమానం కలుగుతోంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…