Categories: FeaturedMovie News

హీరోయిన్ శారద భర్త చెంప చెళ్లుమనిపించిన ఎన్టీ రామారావు.. ఎందుకో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి లో 1945 జూలై 25వ తేదీన జన్మించిన సరస్వతి దేవి సినిమా పరిశ్రమలో అరంగేట్రం చేసి తన పేరును శారదా గా పేరు మార్చుకున్నారు. శారదా తన చిన్న వయస్సులోనే చెన్నై లో నివసిస్తున్న తన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి అక్కడే పెరిగి పెద్ద అయ్యారు. తల్లి కోరిక మేరకు ఆరేళ్ల వయసులోనే శారద డాన్స్ నేర్చుకున్నారు. ఆమె పెరిగి పెద్దయిన తర్వాత మళ్ళీ తన తల్లి గారే తనని హీరోయిన్ గా చూడాలని బాగా తపన పడ్డారు. దాంతో తల్లి కోరిక మేరకు ఆమె సినిమా పరిశ్రమలో అరంగేట్రం చేసి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఊర్వశి అనే అవార్డు లభించడంతో ఆమెను ఊర్వశి శారదగా అని సినీ అభిమానులు పిలుస్తుంటారు.

శారదా పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని విషాదకరమైన సంఘటనలే చోటుచేసుకున్నాయి. ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో కొరడా సింహాచలం పై మనసు పారేసుకున్నారు. అప్పటికే చలం ఎన్నో సినిమాల్లో నటించి మంచి యాక్టర్ గా స్థిరపడ్డారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించడం కారణంగా వారి మధ్య స్నేహం, ప్రేమ పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత ఆమె చలం ని పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటినుంచి ఆమె జీవితం ముళ్లబాట లా మారిపోయింది. పైకి అమాయకపు చక్రవర్తి లా కనిపించే చలం శారదా ని మానసికంగా, శారీరకంగా బాగా హింసించేవాడట. సినిమాలలో హీరో పాత్రలలో నటించే అతను నిజ జీవితంలో అతి పెద్ద విలన్ గా మారి తన భార్య శారదాకు నరకం చూపించేవాడట. ముఖ్యంగా శారదా ని బాగా అనుమానిస్తూ ఆమెను మానసికంగా హింసించే వాడట. భర్త ప్రతి రోజు అనుమానిస్తున్నడంతో ఆమె ఆ బాధను తాళలేక తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారట.

స్టార్ హీరోయిన్ కాబట్టి తరచూ సినిమా షూటింగులు వెళ్లేవారు శారదా. అయితే షూటింగ్ కి వెళ్ళిన ప్రతిసారీ ఆమెను అనుమానిస్తూ ఉండేవాడు చలం. సినిమా సెట్స్ కి వెళ్లి శారదను కొట్టిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయట. 1971వ సంవత్సరం లో విడుదలైన జీవిత చక్రం సినిమాలో ఎన్టీఆర్, శారద, వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీకరణ జరిగే సమయంలో శారద మేకప్ రూమ్ లోకి పూటుగా మద్యం తాగి వచ్చిన చలం శారద పై చెయ్యి చేసుకున్నాడు. అయితే ఈ విషయం కాస్త ఎన్టీరామారావు కి తెలియడంతో ఆయన వెంటనే శారదా వద్దకు వచ్చి ఆమెను ఓదార్చి.. ఆపై “ఏం, చలం!! ఆడవారిని చూసుకునే విధానం ఇదేనా?” అని ఆవేశంగా గద్దయిస్తూ చంప చెల్లుమనిపించారట. కొన్నేళ్లు గడిచిన తరువాత తన భర్త అనుమానం విపరీత రూపం దాల్చడంతో ఇక చేసేదేమీ లేక అతనికి విడాకులు ఇచ్చేసింది శారద. ఆ తర్వాత శారద మళ్లీ పెళ్లి చేసుకోలేదు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago