Categories: FeaturedMovie News

NTR 30 Crazy Combination : కొరటాల సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా సాయిపల్లవి..!?

NTR 30 Crazy Combination : ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రమ్ కొరటాల దర్శకత్వంలో రాబోతోంది. ఓటమి ఎరుగని కొరటాల ఆచార్య సినిమాతో డిజాస్టర్ ను చూసాడు. ఇక ఆచార్య సినిమా ఫలితం తరువాత కొరటాల ఎన్టీఆర్ తో తీసే సినిమా పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారట. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక ఎన్టీఆర్ కూడా కొరటాల కు ఆచార్య ఫలితాన్ని ను వదిలేసి రిలాక్స్ అయ్యాకనే ఈ సినిమా కథ గురించిన పనులు మొదలుపెట్టమని చెప్పారట.

ఇక కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా గురించి ఇప్పటికే కొరటాల ఒక అంచనా ఇచ్చారు. భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతోందని చెప్పేసారు. ఇక ఈ మాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా తొలుత ఆలియా భట్ హీరోయిన్ అంటూ వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఆలియా భట్ పెళ్లి చేసుకోవడంతో ఈ సినిమా చేయడంలేదనే క్లారిటీ ఇచ్చింది.

ఇక కొరటాల కూడా ఇంకా హీరోయిన్ ను ఫైనల్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇపుడు ఎన్టీఆర్ కు జోడిగా సాయి పల్లవిని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం లేకపోయినా ఫిల్మ్ నగర్ లో మాత్రమే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ జోడి గనక సెట్ అయితే వీళ్లిద్దరి డాన్స్ లకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. శ్యామ్ సింగ్ రాయి సినిమా తరువాత సాయి పల్లవి మరో సినిమా కు సైన్ చేయలేదు. ఈ అమ్మడు త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అందునా సాయి పల్లవి సినిమాలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే సినిమాలో నటిస్తుంది. అందుకే శ్యామ్ సింగ్ రాయి తరువాత ఏ సినిమాను ఒప్పుకోలేదు. ఇక ఇపుడు కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమాను చేస్తుందో లేదో చూడాలి. ఇక ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఇరువురి అభిమానులకు పండగే.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago