Puja Hegde intresting comments : ప్రస్తుతం టాలీవుడ్ లో ని అగ్ర కథానాయికలలో ఒకరు పూజ హెగ్డే. ప్రస్తుతం యువ హీరోల ఫస్ట్ ఆప్షన్ గా పూజా హెగ్డే హవా నడుస్తోంది. అయితే ఇన్ని రోజులు గోల్డెన్ లెగ్ గా అనిపించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం రాదే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో ఐరన్ లెగ్ గా పేరు సంపాదించుకున్నప్పటికీ ఈమెకు కుర్రకారులో ఉన్న ఇమేజ్ మాత్రం తగ్గటం లేదు. అందుకే వరుస అపజయాలు తర్వాత కూడా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ఇంత బిజీ హీరోయిన్ గా ఉన్నప్పటికీ పూజా హెగ్డే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ లో పూజా హెగ్డే తన ఫేవరెట్ హీరో గురించి అలాగే 12 ఏళ్ల వయసులో తన హృదయం ముక్కలైన సంగతి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
12 ఏళ్ల క్రితమే ఆ సంఘటనతో నా హృదయం ముక్కలైంది…..
ఆచార్య సినిమా తర్వాత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇలా చెప్పారు. తనకు చిన్నప్పటి నుండి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే విపరీతమైన అభిమానం అంట, అంతేకాకుండా ఒక సారి ఎలాగైనా కలవాలి అని అనుకుందట. అయితే అదే సమయంలో కోయీ మిల్ గయా సినిమా ప్రీమియం జరగడంతో ఆ అవకాశాన్ని వదులు కోలేదట. అయితే ఆ ప్రీమియర్ షో కి వెళ్లిందట పూజ హెగ్డే. అయితే అందరూ స్టేజిమీద హృతిక్ రోషన్ తో ఫోటోలు దిగుతుండగా, తను కూడా స్టేజ్ మీదకి ఎక్కి హృతిక్ రోషన్ తో ఫోటో తీసుకోవాలని అనుకుందట.
అయితే పూజా హెగ్డే స్టేజి మీదకు వెళ్లే సరికి హృతిక్ రోషన్ దిగిపోయారట. ఆ సంఘటనతో నా హృదయం ముక్కలైపోయింది అని ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అప్పుడు తన వయసు 12ఏళ్లు అని చెప్పుకొచ్చారు. అయితే పూజా హెగ్డే పదేళ్ల తర్వాత హృతిక్ రోషన్ తో మొహంజదారో సినిమాలో కలిసి నటించడం మరో విశేషం. ఇలా పూజా హెగ్డే తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…