Manchu Vishnu: ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..ట్వీట్ వైరల్!
Manchu Vishnu: మంచు విష్ణు మోహన్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు పొంది ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మా ఎన్నికలలో నటుడు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించి మా బాధ్యతలను విష్ణు తీసుకున్నారు.
ఈ విధంగా మా ఎన్నికల సమయం నుంచి మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ఈ వ్యాఖ్యలు చేసిన తీవ్రస్థాయిలో వైరల్ అవుతూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ గురవుతున్నాయి. ఈ క్రమంలోనే మంచు విష్ణు ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయం గురించి మరోసారి మాట్లాడారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీ పెద్ద గురించి ఈయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దర్శకరత్న దాసరి నారాయణరావు గారు జయంతి వేడుక సందర్భంగా ఇండస్ట్రీ మొత్తం దర్శకుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దర్శకుల దినోత్సవం సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ దాసరి గారు మరణించిన తర్వాత ఆయన స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేదు. అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్ద దాసరి గారే అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే మంచు విష్ణు ట్విట్ పై మెగా అభిమానులు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఇండస్ట్రీ పెద్ద మెగాస్టార్ చిరంజీవి అంటూ కామెంట్లు చేయడమే కాకుండా ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు కనక ఆయనే ఇండస్ట్రీ పెద్ద అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే చిరంజీవి అలాంటి బాధ్యత తీసుకోవడానికి తాను సిద్ధంగాలేనని, కాకపోతే ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా తన వంతు సహాయం చేస్తానని మెగాస్టార్ వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…