NTR Jayanthi: సీనియర్ నటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ జయంతి ఉత్సవాలలో భాగంగా నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి తాతకు నివాళులు అర్పించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన తాతకు నివాళులు అర్పించిన అనంతరం సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా తన తాతయ్య ఫోటోని షేర్ చేస్తూ.. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మిమ్మల్ని స్మరించుకుంటూ అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఘాట్ లో తాతయ్యకు నివాళులు అర్పిస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇకపోతే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా బాలకృష్ణ కుటుంబం వారి స్వగ్రామమైన నిమ్మకూరులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే గ్రామ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…