Categories: FeaturedGeneral News

Ntr fan Shyam death mystery : మా అబ్బాయి చేతి పై బ్లేడు గాట్లు… 170 సార్లు పేపర్ పైన రాసింది అదే…: శ్యామ్ తండ్రి

Ntr fan Shyam death mystery : జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మొన్నా మధ్య బాగా వైరల్ అయిన కోనసీమ జిల్లా చింతలూరు కి చెందిన 20 ఏళ్ల అబ్బాయి శ్యామ్ మణికంఠ అనుమానస్పదంగా మృతి చెందడంతో తాజగా సోషల్ మీడియాలో శ్యామ్ మృతికి న్యాయం చేయాలంటూ ట్రెండ్ చేస్తున్నారు అందరు హీరోల ఫాన్స్. ఎన్టీఆర్ ను బాగా అభిమానించే శ్యామ్ విశ్వక్ సేన్ సినిమా ‘దాస్ కా దమ్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బౌన్సర్ లను దాట్టుకుని ఎన్టీఆర్ ను హగ్ చేసుకున్నాడు. ఆలా చేసినందుకు ఎన్టీఆర్ అతడిని ఏమి అనలేదు. బౌన్సర్లు నెట్టేయబోతుంటే ఎన్టీఆర్ ఆపి హాగ్ ఇచ్చి ఫోటో తీయించుకుని పంపాడు. ఆలా బాగా వైరల్ అయిన శ్యామ్ నేడు విగతాజీవిగా మారడంతో అనేక అనుమానాలు శ్యామ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

శ్యామ్ ను ఎవరో హత్య చేశారు..?

శ్యామ్ మణికంఠ కోనసీమ జిల్లా చింతలూరు గ్రామానికి చెందిన యువకుడు. జూన్ 24 రాత్రి నుండి జూన్ 25 ఉదయం 6 గంటల మధ్య ప్రాంతంలో మరనించాడు. శ్యామ్ తండ్రి చెబుతున్న దాని ప్రకారం శ్యామ్ రాత్రి పది గంటలకు ముందు కూడా తమతో ఫోన్ లో మాట్లాడాడు, రేపు ఇంటికి వస్తాను అని కూడా చెప్పాడు. మళ్ళీ పది తరువాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్అఫ్ అయింది. పొద్దున్నే వస్తాడు కదా ఆనుకున్నాం ఇలా అవతుందని అనుకోలేదు, మా అబ్బాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు అంటూ శ్యామ్ తండ్రి బాధపడ్డారు. తాను ఆత్మహత్య చేసుకున్నాడో లేక ఎవరైనా చంపి ఆలా చిత్రీకరిస్తున్నారో తెలియదని, ఫోన్లో మాట్లాడినపుడు మామూలుగానే మాట్లాడాడు అని చెప్పారు.

ఏదైనా సమస్య ఉంటే చెప్పేవాడు ఆలా ఏమి మాకనిపించలేదు. వాళ్ళ అమ్మతో వీడియో కాల్ లో మాట్లాడాడని చెప్పారు. తాను చనిపోతున్నట్లు వీడియోలో ఉంది, ఒంటి మీద బ్లేడు తో గాట్లు ఉన్నాయ్. అలాగే సారీ అంటూ 170 సార్లు పేపర్ లో రాశాడు. తనకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు కానీ గంజాయి ప్యాకెట్లు దొరికాయని అంటున్నారు. నా కొడుకు మృతికి న్యాయం చేయాలి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago