NTR’s Badipanthulu @50 : ఎన్టీఆర్ అనగానే గొప్ప పౌరాణికాలు, అలాగే జానపద చిత్రాలు గుర్తుకువస్తాయి. ఆయన ఆ జోనర్స్ లో మరెవరూ సాహసించినటువంటి చిత్రాలను తన నటనతో రక్తి కట్టించారు. అప్పట్లో జానపదాలు, పౌరాణికాలు అంటే ఎన్టీఆర్, సాంఘిక చిత్రాలంటే ఏఎన్ఆర్ అనేలా వారి సినిమాలు సాగేవి. కానీ సాంఘిక సినిమాల్లో కూడా నేను మిన్న అని నిరూపించుకున్నారు ఎన్టీఆర్. రక్త సంబంధం, మిస్సమ్మ బడిపంతులు, వంటి చిత్రాలతో మెప్పించారు. వయసుమల్లిన పాత్రలో కనిపించి బడిపంతులు సినిమాలో రిస్క్ చేసినా ప్రేక్షకులు మాత్రం ఆ సినిమాకు నీరజనాలు పలికారు. అటువంటి బడిపంతులు సినిమా 1972 నవంబర్ 23 న విడుదల అయి నేడు నవంబర్ 23 2022 నాటికి సరిగ్గా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఆ సినిమా విశేషాలను గుర్తుచేసుకుందాం.
వృద్ధ దంపతుల లాగా ఎన్టీఆర్, అంజలి నటన కట్టిపడేసింది…
త్రివేణి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పి.పేర్రాజు నిర్మాణంలో, పి.చంద్ర శేఖర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘బడిపంతులు’ సినిమా 1958లో వచ్చిన కన్నడ చిత్రం ‘స్కూల్ మాస్టర్’ సినిమాకు రీమేక్. సాంఘిక చిత్రాల ద్వారా కూడా కుటుంబ ప్రేక్షకులను ఎన్టీఆర్ ఈ చిత్రం ద్వారా అలరించారు. నిజాయితీ పరుడిగా జీవిస్తున్న సాధారణ బడిపంతుల లాగా ఎన్టీఆర్ ఆయన భార్యగా అంజలి దేవి గారి నటన వయసు మళ్ళిన పాత్రలో అద్భుతంగా చేసారు.
ఇక ఎన్టీఆర్ కొడుకులుగా రామకృష్ణ, కృష్ణం రాజుల నటన పూర్వ విద్యార్తిగా జగయ్య గారి నటన అద్భతం. పిల్లలు తల్లిదండ్రులను వాటాలుగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరు పిలుచుకుని పోతే ఆ వయసులో విడివిడిగా ఉంటూ ఇబ్బందిపడుతున్న వృద్ధ దంపతుల లాగా ఎన్టీఆర్, అంజలి పాత్రలు ఆ రోజుల్లో ఎంతో మంది కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో కృష్ణం రాజుకు కూతురుగా, ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించడం మరో విశేషం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…