టాలీవుడ్ లో నాగచైతన్య సరసన ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అనుపమ పరమేశ్వరన్.. ఆ సినిమాలో తన అందం, అమాయకత్వపు నటనతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది.. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది..ఇప్పుడు మాత్రం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.. అయితే ఆమె చేసిన ఓ పోరపాటు ఆమె కెరీర్ ను దిగువస్థాయికి దిగజార్చింది.
నేటి జనరేషన్ క్లాసిక్ మూవీ అనిపించుకున్న ‘రంగస్థలం’ సినిమాలో మొదట హీరోయిన్ గా అనుకుంది ‘అనుపమ పరమేశ్వరన్’నే. అంతా ఓకే, ఇక సినిమా సెట్స్ పైకి వెళ్లే టైంలో ఆమె ప్లేస్ లోకి సమంత వచ్చి చేరింది. ఆఖరి నిమిషంలో అనుపమను ఎందుకు తప్పించారు.సమంత స్టార్ హీరోయిన్ కాబట్టి, అందుకే అనుపమను సైడ్ చేశారు అని దీనిపై అప్పట్లో అనేక కథనాలను తెగ వైరల్ చేశారు. ఇక అనుపమ కూడా ఈ విషయంలో తెగ హర్ట్ అయిపోయి ఇదైపోయింది అని వార్తలు వచ్చాయి.
అయితే, ఈ వార్తల పై అప్పటి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా స్పందిస్తూ.. తమ రాబోయే సినిమాల్లో అనుపమతో కచ్చితంగా కలిసి పనిచేస్తాం అని వివరణ ఇచ్చారు.కట్ చేస్తే కాలం వేగంగా ముందుకు వచ్చింది. రంగస్థలం సినిమా వచ్చి కూడా దాదాపు రెండేళ్లు దాటుతోంది. పైగా మైత్రీ నుంచి కూడా చాలా సినిమాలొస్తున్నాయి. కానీ అనుపమకు మాత్రం మళ్ళీ మైత్రి నుండి అవకాశం రాలేదు. ఆ మాటకొస్తే అనుపమ పేరు చాల సినిమాల్లో గట్టిగా వినిపిస్తోంది గాని, చివరకు వచ్చే సరికి.. ఆయా సినిమాల నటీనటుల లిస్ట్ లో అనుపమ ఉండటం లేదు.
నిజానికి ‘వకీల్ సాబ్’ సినిమాలో నివేదా థామస్ పాత్ర మొదట అనుపమ పరమేశ్వరన్ దగ్గరకు వెళ్ళింది. ఏమైందో ఏమో తెలియదు గానీ, ఆ తరువాత డేట్స్ కుదరక అనుపమ ఈ సినిమాని వదులుకుంది అని వార్తలు వచ్చాయి. మళ్ళీ కట్ చేస్తే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయింది. ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ మాత్రమే హైలైట్ అవుతాడు అనుకుంటే.. నివేదా థామస్ పాత్ర కూడా హైలైట్ అయింది.మొత్తానికి పై రెండు సినిమాలు అనుపమ పరమేశ్వరన్ చేసి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది. అయితే ‘అనుపమ’ది చిన్నపిల్లల మనస్తత్వం అట. తెలిసి తెలియక ఆమె తన సినిమాల సెలక్షన్ తో కెరీర్ ను నాశనం చేసుకుంటుంది అని ఆమె గురించి తెలిసిన వాళ్ళు అంటున్నారు..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…