టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది..గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేని ఈ అమ్మడు.. ఇటీవలే నితిన్ సరసన చెక్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలెట్టింది.. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు.. హిందీ సినిమాలు చేస్తోంది రకుల్.. ఇందులో భాగంగానే ఓ హిందీ సినిమాలో కండోమ్ కంపెనీ ఎక్స్ క్యూటివ్ గా నటించబోతుంది.. కండోమ్ కంపెనీలో ఒక లేడీ ఎక్స్ క్యూటివ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది ?
అందరూ ఆమెను ‘సెక్స్’క్యూటివ్ గా ట్రీట్ చేస్తుంటే ఎలా ఉంటుంది ? అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. సినిమాలో రకుల్ పాత్ర పని ఏమిటంటే..కండోమ్ కంపెనీల్లో టెస్టింగ్, అంటే కండోమ్స్ నాణ్యతని పరిశీలించి చెప్పే పనిని చేయబోతుంది రకుల్. బాలీవుడ్ లో రానున్న ఈ మూవీ పక్కా కామెడీ మూవీగా తెరకెక్కనుంది. ‘కండోమ్ టెస్టర్’ పాత్రని రకుల్ పోషించబోతుంది. ఐతే, ఈ పాత్రలో నటించే ఛాన్స్ రకుల్ కి లక్కీగా వచ్చింది.
నిజానికి ఈ పాత్రను మొదట జాన్వీ కపూర్ తో లేదా అనన్య పాండేతో చేయించాలని అనుకున్నారు మేకర్స్.కానీ వాళ్ళు ఈ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. ఆ తరువాత సారా అలీ ఖాన్ ను అప్రోచ్ అయ్యారు. ఆమె కూడా నో చెప్పింది. మొత్తమ్మీద ఈ పాత్ర చేసేందుకు ఆ ముగ్గురూ ముందుకు రాకపోయే సరికి తప్పనిసరి పరిస్థితుల్లో రకుల్ ప్రీత్ సింగ్ ను ఆ పాత్ర కోసం తీసుకున్నారు.
రకుల్ కి ఇప్పుడు ఎలాగూ తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు.అందుకే హిందీలో వస్తోన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకుపోతుంది. ఏది ఏమైనా బోల్డ్ క్యారెక్టర్స్ ను పోషించడంలో రకుల్ ఆరితేరిపోయింది. ఇంతకీ ఈ సినిమాని ప్రముఖ నిర్మాత రాని స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ఇక వెరైటీ కాన్సెప్ట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన హీరో ఆయుష్మాన్ ఖురానా ఈ సరికొత్త సినిమాలో హీరోగా నటిస్తున్నాడు..!!
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్‌లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…