పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే.. ఈమె తాజాగా బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది.. అయితే పవన్ కళ్యాణ్ తో ఆమె బంధం తెగిపోయిన తరువాత కూడా, ఆమెను తమ వదినగానే ఫీల్ అవుతూ ఉంటారు పవన్ ఫ్యాన్స్. అయితే, ప్రస్తుతం ఆమె చేస్తోన్న పని, పవన్ ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు. ఎందుకు రేణు దేశాయ్ ఇలా ప్రవర్తిస్తుంది ?
తన సెకెండ్ ఇన్నింగ్స్ కోసం మరీ ఇలా చేయాలా ?అంటూ పవన్ ఫ్యాన్స్ తెగ ఫిల్ అయిపోతున్నారు.ఇంతకీ ఆమె చేసిన పని ఏమిటంటే.. తానూ జడ్జ్ గా వ్యవహరిస్తోన్న షోకి పవన్ కుమార్తె ‘అధ్యా’ను తీసుకురావడం. కేవలం టీఆర్పి రేటింగ్ పెంచుకోవడానికే ఆ షో యాజమాన్యం అధ్యాని షోకు తీసుకువచ్చేలా చేశారు. మొత్తానికి రేణు దేశాయ్, పవన్ స్టార్ డమ్ ను వాడుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ పవన్ ఫ్యాన్స్ కి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటుంది.అన్నట్టు పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా సినిమాలో రేణు దేశాయ్ నటించబోతుంది. తన సెకెండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్న రేణు, అన్ని చూసుకుని ఈ పాన్ ఇండియా మూవీని ఒప్పుకుంది. ఈ మూవీ పేరు ‘ఆధ్యా’. ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటి- గీతిక రతన్ యువ జంటగా నటించే ఈ ‘ఆద్య’ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది.
మరి రేణు దేశాయ్ తన రీఎంట్రీతో పాన్ ఇండియా సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందా చూడాలి. మొత్తానికి మళ్లీ ఎలాగైనా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని రేణుదేశాయ్ ఎన్నాళ్లగానో పరితపిస్తోంది. మరోపక్క బుల్లితెర పై షోలలో జడ్జ్ గా కూడా అందర్నీ అలరిస్తోంది. అప్పుడప్పుడు డాక్యుమెంటరీలు తీస్తున్న ఈమె.. ఇప్పుడు డైరెక్టర్ గా కూడా మారి..ఓ సినిమా కూడా తీస్తున్నట్లు తెలుస్తోంది..!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…