బిగ్ బాస్ ఐదో సీజన్ కు నేటితో తెరపడుతోంది. అందరి కళ్లు ఎవరుగెలుస్తారనే దానిపైనే ఉన్నాయి. అయితే అంతకుముందు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫైనలిస్టులతో మాజీ కంటెస్టెంట్లు ఓ ఆట ఆడుకున్నారు. ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్లు శివబాలజీ, హరితేజ… హౌజ్ మేట్లతో ముచ్చటించారు. హౌజ్ మేట్లతో ఫన్నీ ఫీట్స్ చేయించారు. ముందుగా శ్రీరామ్ చంద్రతో ఎవరు ఫ్రెండ్ షిప్ చేసినా.. ఎలిమినేట్ అవుతున్నారని సెటైర్ వేయడంతో.. అందర్నిలో నవ్వులు ఆగలేదు.
ఈ క్రమంలో షన్నూ, సిరిలు మరోసారి తమ టాలెంట్ చూపించారు. పీపా పట్టుకుని ఊదితే అది ఏ పాటో చెప్పి.. ఆ పాటకు డ్యాన్స్ చేయాలి. దీనికి షన్నూ, సిరి కలిసి డ్యాన్స్ చేయగా… మిగిలిన ముగ్గురు ఎవరికి వారే డ్యాన్స్ చేయడంతో.. పాపం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ అనేసింది హరితేజ. రెండో సీజన్ కంటెస్టెంట్లు గీతా మాధురి, రోల్ రైడా ఆటపాటలతో హౌస్‌మేట్స్‌ను అలరించారు. సిరిని పొగడ్తలతో ముంచేశారు. టాప్ 5 లో చోటు దక్కించుకున్న సిరి తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఆదర్శం అంటూ తెగ పొగిడాడు. కాగా మరోసారి షన్నూ, సిరిలు టార్గెట్ అయ్యారు. వీరిద్దరి స్నేహంపై సెటైర్లు పేలాయి.
దీంతో సన్నీ, మానస్ , శ్రీరామ్ పడీపడీ నవ్వారు. అసలే చిన్న మాట అంటేనే తట్టుకోలేని షణ్ను ఇలా అందరూ కలిసి తన మీద పడిపోవడంతో అట్టుడికిపోయాడు. చిన్నమాటను కూడా తట్టుకోలేని షన్నూ.. సిరితో వాపోయాడు. మరోసారి సిరిని షన్నూ హగ్ చేసుకోవడంతో… ఇది చూసిన సన్నీ షన్ముఖ్ కి హగ్ గురూ అయిపోతాడని కామెంట్ చేశాడు. నాలుగో సీజన్ కంటెస్టెంట్లు శివజ్యోతి, సావిత్రి హౌస్‌మేట్స్‌తో కబుర్లాడారు. బెలూన్లలోని హీలియం గాలి పీల్చుకుని పాటలు, డైలాగులు చెప్పాలన్నారు. దీంతో గొంతులు మారడంతో అందరూ పడిపడి నవ్వారు. ఐదో సీజన్ కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్, అరియానా వచ్చీరాగానే శ్రీరామ్ చేసిన మొట్ట మొదటి ఆల్బమ్‌లోని సాంగ్ ప్లే చేయడంతో అతడు సర్‌ప్రైజ్ అయ్యాడు.
శ్రీరామ్ చంద్రను షాక్ కు గురిచేశారు. తను చేసిన మొదటి ఆల్బమ్ లోని పాటను ప్లే చేయడంతో సర్ ప్రైజ్ అయ్యాడు. అందులో భాగంగా డేటింగ్ యాప్‌లో ఎవరినైనా కలిశారా? అని అడగ్గా సన్నీ ఒకరిని కలిశాను కానీ ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పుకుంటూ పోయిందని, దీంతో తానే ఆమెను ఓదార్చాల్సి వచ్చిందన్నాడు. వేరే కంటెస్టెంట్ల టవల్స్ ఎప్పుడైనా వాడారా అని అడగ్గా.. షన్నూ, శ్రీరామ్ టవల్ వాడానని చెప్పాడు. మధ్యలో కలుగ చేసుకుని సిరి తన టవల్ కూడా వాడాడంటి. ఫోటోలు చూపించి అవి హౌజ్ లో ఎక్కడున్నాయని అడగ్గా అన్నింటికి సరైన సమాధానం చెప్పి శ్రీరామ్ చంద్ర గెలిచాడు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…