Categories: FeaturedMovie News

హౌజ్ లో మాజీ కంటెస్టెంట్ల హంగామా.. షణ్ముఖ్, సిరిని ఓ రేంజ్ లో ఆడుకున్నారుగా!

బిగ్ బాస్ ఐదో సీజన్ కు నేటితో తెరపడుతోంది. అందరి కళ్లు ఎవరుగెలుస్తారనే దానిపైనే ఉన్నాయి. అయితే అంతకుముందు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫైనలిస్టులతో మాజీ కంటెస్టెంట్లు ఓ ఆట ఆడుకున్నారు. ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్లు శివబాలజీ, హరితేజ… హౌజ్ మేట్లతో ముచ్చటించారు. హౌజ్ మేట్లతో ఫన్నీ ఫీట్స్ చేయించారు. ముందుగా శ్రీరామ్ చంద్రతో ఎవరు ఫ్రెండ్ షిప్ చేసినా.. ఎలిమినేట్ అవుతున్నారని సెటైర్ వేయడంతో.. అందర్నిలో నవ్వులు ఆగలేదు.

ఈ క్రమంలో షన్నూ, సిరిలు మరోసారి తమ టాలెంట్ చూపించారు. పీపా పట్టుకుని ఊదితే అది ఏ పాటో చెప్పి.. ఆ పాటకు డ్యాన్స్ చేయాలి. దీనికి షన్నూ, సిరి కలిసి డ్యాన్స్ చేయగా… మిగిలిన ముగ్గురు ఎవరికి వారే డ్యాన్స్ చేయడంతో.. పాపం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ అనేసింది హరితేజ. రెండో సీజన్ కంటెస్టెంట్లు గీతా మాధురి, రోల్‌ రైడా ఆటపాటలతో హౌస్‌మేట్స్‌ను అలరించారు. సిరిని పొగడ్తలతో ముంచేశారు. టాప్ 5 లో చోటు దక్కించుకున్న సిరి తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఆదర్శం అంటూ తెగ పొగిడాడు. కాగా మరోసారి షన్నూ, సిరిలు టార్గెట్ అయ్యారు. వీరిద్దరి స్నేహంపై సెటైర్లు పేలాయి.

దీంతో  సన్నీ, మానస్ , శ్రీరామ్‌ పడీపడీ నవ్వారు. అసలే చిన్న మాట అంటేనే తట్టుకోలేని షణ్ను ఇలా అందరూ కలిసి తన మీద పడిపోవడంతో అట్టుడికిపోయాడు. చిన్నమాటను కూడా తట్టుకోలేని షన్నూ.. సిరితో వాపోయాడు. మరోసారి సిరిని షన్నూ హగ్ చేసుకోవడంతో… ఇది చూసిన సన్నీ షన్ముఖ్ కి హగ్ గురూ అయిపోతాడని కామెంట్ చేశాడు. నాలుగో సీజన్‌ కంటెస్టెంట్లు శివజ్యోతి, సావిత్రి హౌస్‌మేట్స్‌తో కబుర్లాడారు. బెలూన్లలోని హీలియం గాలి పీల్చుకుని పాటలు, డైలాగులు చెప్పాలన్నారు. దీంతో గొంతులు మారడంతో అందరూ పడిపడి నవ్వారు. ఐదో సీజన్‌ కంటెస్టెంట్లు అఖిల్‌ సార్థక్‌, అరియానా వచ్చీరాగానే శ్రీరామ్‌ చేసిన మొట్ట మొదటి ఆల్బమ్‌లోని సాంగ్‌ ప్లే చేయడంతో అతడు సర్‌ప్రైజ్‌ అయ్యాడు.

శ్రీరామ్ చంద్రను షాక్ కు గురిచేశారు. తను చేసిన మొదటి ఆల్బమ్ లోని పాటను ప్లే చేయడంతో సర్ ప్రైజ్ అయ్యాడు. అందులో భాగంగా డేటింగ్‌ యాప్‌లో ఎవరినైనా కలిశారా? అని అడగ్గా సన్నీ ఒకరిని కలిశాను కానీ ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్పుకుంటూ పోయిందని, దీంతో తానే ఆమెను ఓదార్చాల్సి వచ్చిందన్నాడు. వేరే కంటెస్టెంట్ల టవల్స్ ఎప్పుడైనా వాడారా అని అడగ్గా.. షన్నూ, శ్రీరామ్ టవల్ వాడానని చెప్పాడు. మధ్యలో కలుగ చేసుకుని సిరి తన టవల్ కూడా వాడాడంటి. ఫోటోలు చూపించి అవి హౌజ్ లో ఎక్కడున్నాయని అడగ్గా అన్నింటికి సరైన సమాధానం చెప్పి శ్రీరామ్ చంద్ర గెలిచాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago