ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ప్రతీ రోజూ పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని.. మునుపటి వేవ్ కంటే.. ఈ సారి వచ్చే వేవ్ ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించింది.
దీంతో కొన్ని దేశాలు ఇప్పటికే విదేశీ ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించడం లేదు. ఇక మన భారతదేశలో కూడా కేసులు తగ్గి, సాధారణ జనజీవనం మొదలైన కొద్దినెలల్లోనే ‘ఒమిక్రాన్’ వేరియంట్ రూపంలో కలవరపెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరగవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి.. అన్నిరంగాలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, వైరస్‌పై భయం తగ్గడంతో జనం మాస్కులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలను పక్కనపెట్టారు.
అయితే దీనిపై రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ కొత్త వేరియంట్ వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ఎయిర్ పోర్టు వద్ద విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అవసరమనుకుంటే వారిని క్వారంటైన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త వేరియంట్ మూలంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు కేంద్రాలకు నిన్నటి నుంచి పరుగెడుతున్నారు. ప్రజల్లో భయం మళ్లీ మొదలైందనే చెప్పాలి. ఇక మంత్రిమండలి సమావేశం మాల్స్, థియేటర్ల నియంత్రణకు సంబంధించి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు, వైద్యులు సూచించారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…