భారత్ లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా వ్యాప్తి చెందుతుందో తెలియని ఈ వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు ఈ వైరస్ బారిన పడుతూ ఉండటం గమనార్హం. గాలి ద్వారా కూడా కరోనా మహమ్మారి వ్యాపిస్తుందని గతంలో చేసిన పరిశోధనల్లో తేలడంతో ప్రజలు సైతం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కొరకు ఆశగా ఎదురు చూస్తున్నారు.
అయితే శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో కరోనా మహమ్మారి గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తాజాగా భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఐసీఎంఆర్ వెల్లడించిన విషయాలు శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయేలా ఉండటం గమనార్హం. ఐసీఎంఆర్ తాజా వ్యాఖ్యల ప్రకారం దేశంలో ఇప్పటికే కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి కోలుకున్నారు.
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మాట్లాడుతూ దేశంలో పది సంవత్సరాలకు పై బడిన వారిలో ప్రతి 15మందిలో ఒకరు కరోనా బారిన పడ్డారని షాకింగ్ విషయాలను వెల్లడించారు. అర్బన్ నాన్ స్లమ్ ఏరియాస్ లో, మురికివాడల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగానే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోందని ఐసీఎంఆర్ పేర్కొంది.
ఐసీఎంఆర్ గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూసినప్పుడు పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో నాలుగు రెట్లు ఎక్కువగా, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు ఎక్కువగా కరోనా వైరస్ ను గుర్తించామని పేర్కొన్నారు. దేశంలో 7.1 శాతం మంది యువత కరోనా బారిన పడినట్టు ఐసీఎంఆర్ చెబుతోంది. గతంలో చేసిన సర్వేలో దేశంలో 0.73 శాతం మందికి కరోనా సోకిందని తేలగా ఇప్పుడు ఆ శాతం భారీగా పెరగడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…